Begin typing your search above and press return to search.
వచ్చే జన్మలో జగన్ లా పుట్టాలంటున్న వినాయక్
By: Tupaki Desk | 5 Jan 2017 4:02 PM GMTమళ్లీ జన్మంటూ ఉంటే జగన్ వలే పుట్టాలని ఉందని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ ప్రకటించారు! మెగాస్టార్ 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ సెన్సేషనల్ డైరెక్టర్ చెప్పింది తన అభిమాన డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ గురించి! ‘ఖైదీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వినాయక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రపంచ సినీరంగం మొత్తం తెలుగు సినీ పరిశ్రమ వైపు తిప్పుకొనేలా బాహుబలి సినిమా నిర్మించిన దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి - ఆరు నెలల్లోనే అద్భుతమైన సినిమా తీసే పూరీ జగన్నాధ్ తో పాటు తన సాన్నిహిత్యం గురించి విశ్లేషిస్తూ వినాయక్ ఈ విషయాలు వెల్లడించారు. ఆ ఇద్దరు గ్రేట్ దర్శకుల గురించి వివరిస్తూ తాము ముగ్గురమూ చాలా సరదాగా ఉంటామని వినాయక్ తెలిపారు. రాజమౌళితో కలవడం కుటుంబానికి చేరువ అయినట్లుగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. రాజమౌళి - కీరవాణి వాళ్లను కలుసుకునేందుకు వాళ్ల ఇంటికి వినయ్ గారు వచ్చారు అంటూ చాలా ఆనందంగా స్వాగతిస్తారని వినాయక్ తెలిపారు. ఇక పూరి జగన్నాథ్ గురించి చెప్తూ రాజమౌళికి భిన్నమైన వ్యక్తిత్వమని చెప్పారు. రాజమౌళి కూల్ మనస్తత్వం అయితే జగన్ అందుకు భిన్నమని చెప్తూ ఆయనలో భయం - శ్రద్ధ అసలేమీ కనిపించదని జగన్ గురించి విశ్లేషించారు. ఎప్పుడూ బిందాస్‌గా ఉండటాన్ని చూస్తుంటే మళ్లీ జన్మంటూ ఉంటే జగన్ లా పుట్టాలి అనిపిస్తున్నదని తన సహ డైరెక్టర్ల గురించి వినాయక్ ముచ్చటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/