Begin typing your search above and press return to search.
రాజకీయాల్లోకి మరో అగ్రదర్శకుడు?
By: Tupaki Desk | 14 Aug 2017 8:12 AM GMTటాలీవుడ్‌లో ఆసక్తికర వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా సినీ ప్రముఖులు రాజకీయాల మీద దృష్టి పెడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఓపక్క ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ అధికారపక్షం తరఫున 2019 ఎన్నికల బరిలో నిలవనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా సైతం ఎన్నికల నాటికి మరింత క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రావాలన్న భావన వ్యక్తం చేస్తున్నారు.
ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి చెప్పాల్సిందేమీ లేదు. ఆయన ఇప్పటికే తన క్రియాశీల రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన ఇప్పటికే చేసేశారు. అక్టోబర్ నుంచి తాను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్నట్లుగా వెల్లడించారు. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు సైతం రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రముఖ దర్శకుడు ఎవరోకాదు.. యాక్షన్ మూవీస్ ను తనదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చే వీవీ వినాయక్.
తాజాగా తన సన్నిహితులతో ముచ్చటించే సమయంలో రాజకీయాల ప్రస్తావన వారి మధ్య వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా వీవీ వినాయక్‌ను రాజకీయాల్లోకి రావొచ్చుగా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. దేవుడు కరుణిస్తాడేమో ఎవరికి తెలుసు? అని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. వినాయక్ చేసిన వ్యాఖ్యలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లనున్నారా? అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారిందని చెప్పక తప్పదు.