Begin typing your search above and press return to search.

క్రేజీ కాంబో రిపీట్ అవుతోందా?

By:  Tupaki Desk   |   15 Sep 2017 4:13 AM GMT
క్రేజీ కాంబో రిపీట్ అవుతోందా?
X
టాలీవుడ్ లో ప్రతి హీరోకి ఒక్కో స్టైల్ ఉంటుంది. అలాగే ప్రతి దర్శకుడికి ఒక్కో మేకింగ్ స్టైల్ ఉంటుంది. కానీ కొందరు దర్శకులు వారి మేకింగ్ స్టైల్ కి తగ్గట్టుగా కొందరి హీరోలను డైరెక్ట్ చేస్తే... ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కాంబోలు టాలీవుడ్ లో ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటి కాంబో మరొకటి రిపీట్ అవ్వబోతోంది.

టాలీవుడ్ లో యాక్షన్ - కామెడీ దర్శకుడిగా తనకంటు ఓ గుర్తింపు తెచ్చుకున్న వివి.వినాయక్ తన మేకింగ్ స్టైల్ కి తగ్గట్టుగా సెట్ అయ్యే హీరోతో మరోసారి మంచి యాక్షన్ ఎంటర్టైనర్ కథతో రాబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు ఎనర్జిటిక్ యాక్టర్ మాస్ మహా రాజా రవితేజ. వీరిద్దరి కలయికలో ఇంతకుముందు 2008లో కృష్ణ అనే సినిమా వచ్చింది. మంచి కామెడీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రవితేజ కెరీర్ కి కూడా ఆ సినిమా మంచి బూస్ట్ ని ఇచ్చింది.

అయితే మళ్ళీ అంతకుమించిన ఓ స్ట్రాంగ్ స్టోరితో ఈ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందట. ఓ ప్రముఖ నిర్మాత ఈ కాంబినేషన్ ని సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రవి తేజ రాజా ది గ్రేట్- టచ్ చేసి చూడు అనే రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే వినాయక్ కూడా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇరువురు వారి ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఈ క్రేజీ కాంబో ని స్టార్ట్ చేయనున్నారని టాక్. లెటజ్ సీ.