Begin typing your search above and press return to search.
అఖిల్ తర్వాత నిరుద్యోగిలా మిగిలాడే!!
By: Tupaki Desk | 6 Nov 2015 5:52 AM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రస్తుతం అఖిల్ రిలీజ్ కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు దీపావళి కానుకగా అఖిల్ చిత్రాన్ని ఈనెల 11న రిలీజ్ చేస్తున్నారు. వినాయక్ అక్కినేని లెగసీని కాపాడే సినిమా తీశాడా? లేదా? అన్నది తేలిపోయే రోజు అది. అందుకే పరిశ్రమతో పాటు అటు అక్కినేని అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నారు.
కొత్తకుర్రాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కి అల్లుడు శీను లాంటి హిట్ సినిమాని ఇచ్చిన వినాయక్ అఖిల్ కి కూడా అంతకుమించిన గ్యారెంటీ హిట్ ని ఇస్తాడన్న నమ్మకం అందరిలోనూ ఉంది. అయితే అఖిల్ సంగతి సరే. ఈ సినిమా తర్వాత వినాయక్ చేసే సినిమా ఏంటి? ఎందరు నిర్మాతలు అడ్వాన్సులతో రెడీగా ఉన్నారు? ఏ హీరోకి వినాయక్ ఓకే చెబుతాడు? ఇలాంటి సందేహాలెన్నో సగటు అభిమానికి ఉన్నాయి. వీటన్నిటికీ వినయ్ సమాధానం చెప్పాల్సి ఉంది.
ఇప్పటికైతే అఖిల్ తర్వాత వినాయక్ మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమాకి పనిచేస్తాడనే భావిస్తున్నారంతా. అయితే మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి, బౌండ్ స్ర్కిప్టుతో ఒప్పించిన పరిస్థితి లేదింకా. ల్యాండ్ మార్క్ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహిస్తాడు అన్న మాట తప్ప ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా 150వ సినిమా కోసం నేను కూడా రేసులో ఉన్నా అని పూరి తనంతట తానే ప్రకటించుకున్నాడు కాబట్టి చివరి క్షణంలో అయినా అతడు ఎంటరైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందుగా ఎవరు స్క్రిప్టుతో పక్కాగా ఉంటారో వాళ్లకే ఆప్షన్.
దీన్నిబట్టి చూస్తే వినాయక్ ప్రస్తుతానికి ఉద్యోగం లేని నిరుద్యోగి కిందే లెక్క. అఖిల్ సినిమా తర్వాత అతడు ఏ ప్రాజెక్టు చేస్తాడు అన్నదానికి క్లారిటీ లేనట్టే. టాలీవుడ్ లో ప్రామిస్సింగ్ డైరెక్టర్ డైలమ్మాలో ఉన్నట్టే. కాలమే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.