Begin typing your search above and press return to search.
వినాయక్ కి ఇంకా సినిమా తీసే సత్తా ఉందా?
By: Tupaki Desk | 1 March 2020 3:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో ప్రస్తుతం #చిరు152 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' రీమేక్ లో నటిస్తారని సమాచారం. మొహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లూసిఫర్' రీమేక్ రీమేక్ రైట్స్ ను చాలారోజుల క్రితం చరణ్ తీసుకున్నారు. మెగాస్టార్ హీరోగా ఈ రీమేక్ ను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయంపై చాలా రోజులుగా చర్చలు కొనసాగుతున్నాయి. నిజానికి 'లూసిఫర్' రెగ్యులర్ కమర్షియల్ సినిమా తరహాలో ఉండదు. హీరోయిన్ కు స్కోప్ లేదు. ఇదో పొలిటికల్ డ్రామా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని శాసించే స్థాయిలో హీరో పాత్ర ఉంటుంది. దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ కు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అందుకే మొదట్లో ఈ సినిమా తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ రెడీ చేయమని సుకుమార్ ను కోరారట. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే తాజాగా వీవీ వినాయక్ ఈ సినిమాకు చిరంజీవి ఎంపిక చేశారని సమాచారం. గతంలో 'ఠాగూర్'.. 'ఖైది నెం. 150' చిత్రాలకు వినాయక్ దర్శకత్వం వహించారు. రెండు సినిమాలు రీమేకులే.. రెండూ తెలుగులో సూపర్ హిట్లుగా నిలిచాయి. వినాయక్ ఈ సినిమాకు న్యాయం చేయగలరని.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు సినిమాను మలచగలరని చిరు నమ్ముతున్నారట.
అయితే వినాయక్ ఎంపిక పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'ఖైది నెం. 150' తర్వాత వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇంటెలిజెంట్' దారుణ ఫలితాన్ని అందుకుంది. అప్పటి నుండి వినాయక్ కు అవకాశాలే రాలేదు. దీంతో డైరెక్షన్ పక్కన పెట్టి హీరోగా మారే ప్రయత్నాలలో ఉన్నారు వినాయక్. 'సీనయ్య' పేరుతో సినిమా ప్రకటించారు.. కొంత కాలం షూటింగ్ కూడా సాగింది. అనుకున్న స్థాయిలో అవుట్ పుట్ రాకపోవడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారు. ఈ సమయంలో వినాయక్ దర్శకత్వంపై చిరు పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోలేడేమో అనే సందేహాలు వ్యక్త వుతున్నాయి. ఈ జెనరేషన్ ఆడియన్స్ కు తగ్గట్టు సినిమా తీయగలడా అనేది కూడా అలోచించాల్సిన అంశమని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 'ఠాగూర్'.. 'ఖైది నెం. 150' సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు మార్పులు ఎక్కువగా అవసరం అవుతాయి. మరి ఇన్ని మార్పులు చేర్పులు చేసి వినాయక్ ప్రేక్షకులను మెప్పించగలడా అనేది వేచి చూడాలి..