Begin typing your search above and press return to search.

అది నా అదృష్టం అంటున్న వినాయక్‌

By:  Tupaki Desk   |   1 July 2015 12:02 PM GMT
అది నా అదృష్టం అంటున్న వినాయక్‌
X
గోదావరి జిల్లాలో పుట్టడం తన అదృష్టం అంటున్నాడు స్టార్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌. ఈ నెలలో గోదావరి పుష్కరాలు జరగబోతున్న నేపథ్యంలో గోదావరి బిడ్డగా తన మనసు పులకరిస్తోందన్నాడు వినాయక్‌. గత పుష్కరాలు జరిగే టైంకి దర్శకుడిగా తాను తొలి అడుగులు వేస్తున్నానని.. ఇప్పుడు అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తున్న ప్రెస్టీజియస్‌ మూవీకి దర్శకత్వం వహిస్తున్నానని చెప్పాడు వినాయక్‌. గోదావరి ప్రాంతంతో తన అనుబంధం, పుష్కరాల అనుభవం గురించి వినాయక్‌ గుర్తు చేసుకున్నాడు.

''2003లో గోదావరి పుష్కరాల్ని మరిచిపోలేను. అవి నిన్నో మొన్నో జరిగినట్లుంది. 12 ఏళ్లు అప్పుడే గడిచిపోయాయంటే ఆశ్చర్యంగా ఉంది. 2002లో నా తొలి సినిమా ఆది రిలీజైంది. ఆ చిత్రం విజయోత్సవ వేడుకల రోజుల్లోనే గోదావరి పుష్కరాలు వచ్చాయి. అప్పుడు మా కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రికి వెళ్లి గోదావరిలో స్నానం ఆచరించాను. రాజమండ్రిలో కాలక్షేపం చేసిన రోజుల్ని ఎప్పటికీ మరిచిపోలేను. గోదావరిని చూసినప్పుడు, ఆ నది ప్రస్తావన వచ్చినపుడు.. సినిమాలో గోదావరి సన్నివేశాలు చూసినపుడు నా మనసు పులకరిస్తుంది. గత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం అఖిల్‌ సినిమా కోసం థాయిలాండ్‌లో ఉన్నాను. పుష్కరాల టైంకి కచ్చితంగా మా స్వగ్రామం చాగల్లుకు వచ్చేస్తాను. రెండు రోజులైనా ఉంటాను. మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి కొవ్వూరు, రాజమండ్రి వెళ్లి గోదావరిలో స్నానమాచరిస్తాను'' అని చెప్పాడు వినాయక్‌.