Begin typing your search above and press return to search.

వినాయక్.కామ్.. బాధ్యతకు ప్లాట్ఫామ్

By:  Tupaki Desk   |   13 Feb 2018 5:51 AM GMT
వినాయక్.కామ్.. బాధ్యతకు ప్లాట్ఫామ్
X
కొన్ని కథలు బావున్నట్టే అనిపిస్తాయి. కానీ సెట్స్ పైకి వచ్చే సారికి ఒక్కసారిగా మోసం చేస్తాయి అని వినాయక్ ఓ ఇంటర్యూలో చెప్పాడు. తన కెరీర్లో భారీ డిజాస్టర్స్ అందుకున్న సినిమాలన్నీ అలా మోసం చేసినవే అని వినాయక్ తెలిపాడు. అఖిల్ సినిమా కథను మొదట చాలా నమ్మిన వినాయక్ ఆ తరువాత ఉహించని విధంగా అపజయాన్ని అందుకున్నాడు. 43 కోట్లతో తెరకెక్కిన ఆ సినిమా కేవలం 17 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసింది.

ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్స్ దారుణమైన నష్టాలను చూడాల్సి వచ్చింది. అయితే వినాయక్ వారిని కొన్ని నష్టాల నుంచి తప్పుకునేలా కొంత రెమ్యునరేషన్ ని తిరిగి ఇచ్చేశాడు. అంతే కాకుండా ఖైదీ నెంబర్ వన్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా వినాయక్ అఖిల్ బయ్యర్స్ కి ఆ సినిమా అందేలా చేసి వారు లాభాలను అందుకునేలా చేశాడు. అయితే వినాయక్ లేటెస్ట్ మూవీ ఇంటిలిజెంట్ కూడా దారుణమైన డిజాస్టర్ ని అందుకుంది. సినిమా మొదటి రోజే నెగిటివ్ టాక్ ను అందుకోవడంతో కలెక్షన్స్ ఏ మాత్రం అందలేదు. సినిమాను సాయి ధరమ్ తేజ్ మార్కెట్ కంటే కొంచెం ఎక్కువ స్థాయిలోనే నిర్మించారు. అయితే సినిమా బయ్యర్స్ కి ఏ మాత్రం లాభాలను ఇవ్వలేకపోయింది. దీంతో వినాయక్ మరొకసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు. తన 9 కోట్ల రెమ్యునరేషన్ లో 5 కోట్ల వరకు చెక్ ని బ్యాక్ ఇచ్చాడని తెలుస్తోంది. అసలు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పట్టించుకోని ఈ రోజుల్లో వినాయక్ ఆలోచన నిజంగా భవిష్యత్ తరాలకు ఒక మంచి స్ఫూర్తికి ఉదాహరణ అని చెప్పవచ్చు.

అయితే మొన్న వచ్చిన ఇంటిలిజెంట్ సినిమాలో ధర్మాబాయ్ డాట్ కామ్.. పేదోళ్ళకు ప్లాట్ఫామ్ అని అక్కర్లేని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు కాని.. అది వినయాక్ కోసం మార్చి రాసుకుంటే బావుంటేదమో. వినాయక్ డాట్ కామ్.. బాధ్యతకు ప్లాట్ఫామ్ అని. కాకపోతే ఇలా డబ్బులు తిరిగిచ్చేబదులు మంచి కథను ఎన్నుకుంటే బాగుండేదిగా అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.