Begin typing your search above and press return to search.
మల్టీప్లెక్స్ కడతానంటున్న వినాయక్
By: Tupaki Desk | 6 Jan 2017 10:30 PM GMTటాలీవుడ్లో కొందరు నిర్మాతలకు థియేటర్ల మీద పెట్టుబడి పెట్టడం అలవాటు. కొన్ని థియేటర్లు కొనేసి.. కొన్ని లీజుకు తీసుకుని.. తమకంటూ కొన్ని థియేటర్లను చేతిలో పెట్టుకోవడానికి నిర్మాతలు మక్కువ చూపుతారు. ఐతే నిర్మాతలతో పాటు కొందరు దర్శకులకు కూడా థియేటర్ల మీద ఫోకస్ ఉంది. వైవీఎస్ చౌదరికి గుడివాడలో జంట థియేటర్లు ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కు ఈ థియేటర్ల పిచ్చి ఇంకా ఎక్కువే ఉందట. తన ఆదాయంలో చాలా వరకు థియేటర్ల మీదే పెట్టుబడిగా పెట్టడం అలవాటని వినాయక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. త్వరలో రాజమండ్రిలో మల్టీప్లెక్స్ కూడా కట్టబోతున్నట్లు వినాయక్ వెల్లడించాడు.
‘‘నేను సినిమాల్లోకి రాకముందే మా ఊర్లో మాకో థియేటర్ ఉండేది. అక్కడ సినిమాలు చూసే నాకు ఇండస్ట్రీపై మక్కువ పెరిగింది. ఇక సినిమాల్లో స్థిరపడ్డాక థియేటర్ల మీద అభిమానం ఇంకా పెరిగింది. సినిమాల ద్వారా వచ్చిందంతా సినిమాల మీదే పెట్టడం నాకు అలవాటు. వైజాగ్ లో మూడు థియేటర్లు కలిపి ‘విమాక్స్’ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాం. ఇంకా నా చేతిలో కొన్ని థియేటర్లు ఉన్నాయి. సామర్లకోటలో సత్యకృష్ణ.. చాగల్లులో వెంకటకృష్ణ థియేటర్లు మావే. రాజమండ్రిలో కూడా మల్టీప్లెక్స్ స్టైల్లో థియేటర్లు కట్టాలన్న ప్లాన్ ఉంది. అందుకోసం సైట్ కూడా కొని పెట్టాను. భవిష్యత్తులో మరిన్ని థియేటర్లను కొనాలనుకుంటున్నా’’ అని వినాయక్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/