Begin typing your search above and press return to search.

అన్నయ్య డైరక్టర్ తో తమ్ముడు?

By:  Tupaki Desk   |   3 Jun 2017 4:30 AM GMT
అన్నయ్య డైరక్టర్ తో తమ్ముడు?
X
మీరు ఏ హీరోతో సినిమా చేయాలి అనుకుంటున్నారు ?ఈ ప్రశ్నను మీరు తెలుగులో ఏ దర్శకుడుని అడిగినా మీకు వచ్చే ఒక సమాధానం పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇదే మాట చాలాసార్లు చాలామంది డైరెక్టర్లు చెప్పారు. స్టార్ డైరెక్టర్ దగ్గర నుండి ఇప్పుడే వస్తున్న యువ దర్శకులు వరుకు అందరూ ఇదే మాట చెబుతారు.

ఇప్పుడు ఒక పవర్ఫుల్ కథతో పవర్ ఉన్న దర్శకుడు వి.వి.వినాయక్ స్క్రిప్ట్ ఒకటి సిద్దం చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి - బాలకృష్ణ - రామ్ చరణ్ - ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్స్ కి బంపర్ హిట్లు ఇచ్చారు వి వి వినాయక్. ఇప్పుడు పవన్ కు సరిపడే స్క్రిప్ట్ కోసం పూర్తి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో పవర్ స్టార్ కి కొన్ని కథలు వినిపించిన అవి ఇప్పటి పవన్ ఇమేజ్ కు తగట్టు లేవు అని పక్కనపెట్టారు. తొందరలో ఒక కథను లాక్ చేసే దిశలో వినాయక్ పూర్తిగా నిమగ్నం అయ్యారని టాక్. అన్నయ్య చిరంజీవికి ఠాగూర్ ఖైదీ నెం 150 ఇచ్చిన విధంగానే తమ్ముడుకి భారీ బ్లాక్ బాస్టర్లు ఇవ్వడానికి కథ సిద్దం చేస్తున్నారు అన్నమాట.

పవన్ ఇదివరకు తమిళ్ డైరెక్టర్లు ఆర్.టి.నీసన్ తో సినిమా ప్లాన్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమర్షియల్ సినిమా అవసరం ఉండటంతో వి వి వినాయక్ తో పని చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. ఇది ఇలా ఉంచితే ఎప్పటి నుండో ఏ ఎమ్ రత్నం భారీ బడ్జెట్ సినిమా వాయుదా వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ సినిమా బిజీలో ఉన్నారు. దీని తరవాత అతను సినిమా – రాజకీయం ఎలా సమపాలలో నడిపిస్తారో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/