Begin typing your search above and press return to search.

లేటవ్వడంతో.. అఖిల్‌ కు 400 స్ర్కీన్లు

By:  Tupaki Desk   |   6 Nov 2015 11:30 AM GMT
లేటవ్వడంతో.. అఖిల్‌ కు 400 స్ర్కీన్లు
X
అక్కినేని అఖిల్ హీరోగా న‌టించిన అఖిల్ సినిమా ప్ర‌మోష‌న్ రోజు రోజుకి వేడెక్కిపోతోంది. ఈరోజు వినాయ‌క్ మీడియాతో ట‌చ్‌ లోకొచ్చారు. రేపు ఉద‌య‌మే అఖిల్ కూడా ట‌చ్‌ లోకి వ‌స్తున్నాడు,. ఇప్ప‌టికైతే అఖిల్‌ కి సంబంధించిన స‌మ‌స్త స‌మాచారం విన‌య్ మీడియా చెవిన వేశారు. ఇందులో కొన్ని హాట్ హాట్ టాపిక్స్ ఉన్నాయి. అస‌లు అఖిల్ రేంజు ఎంత‌? అత‌డికి నైజాంలో సీన్ ఎంత ఉంది? అన్న సంగ‌తిని విన‌య్ బైటికే చెప్పారు.

''అఖిల్‌ కి ఇప్ప‌టికే బోలెడంత క్రేజు ఉంది. అత‌డి సినిమాకి నైజాంలో బోలెడంత డిమాండ్ ఉంది. ఏకంగా 350 నుంచి 400 స్ర్కీన్ ల‌లో రిలీజ్ చేస్తున్నాం. ఈ ఫిగ‌ర్ ఆషామాషీ కాదు.. కాకపోతే అప్పట్లో దసరాకు వచ్చుంటే ఇన్ని ధియేటర్లు దొరికేవి కావు.. లేటవ్వడం వలన ఎక్కువ ధియేటర్లు దక్కాయి'' అని వినాయ‌క్ చెప్పారు. అఖిల్ న‌టిస్తా అనాలే కానీ బాలీవుడ్‌ లో బోలెడ‌న్ని సంస్థ‌లు వెయిటింగులో ఉన్నాయ‌ని కూడా వినాయ‌క్ అన్నారు. ''అఖిల్ భ‌విష్య‌త్ సూప‌ర్‌ స్టార్‌. అత‌డిలో క‌సి ఉంది. డెడికేష‌న్ ఉంది. దాంతో ఏదైనా సాధిస్తాడ‌ని విన‌య్ పొగిడేశారు. అఖిల్ ది జువా చిత్రానికి సెన్సార్ పూర్త‌యింది. యుఎ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. నేను చేసిన ఏ సినిమాకి అయినా యు స‌ర్టిఫికెట్ ఉండ‌దు. యుఎ రావాల్సిందే. అలాగ‌ని ఈ సినిమాలో సుమోలు గాల్లోకి లేవ‌వు'' అని చెప్పారు.

అఖిల్ డ్యాన్సులు - ఫైట్స్‌ లో మెరిపిస్తాడు. అస‌లు అఖిల్ ఇంత మంచి డాన్సర్ అని మీరే అంటారు. అంత అద్బుతంగా డ్యాన్సులు చేశాడు. ఇక న‌ట‌న‌లోనూ యూనిక్ స్టార్‌ గా క‌నిపిస్తాడ‌ని వినాయ‌క్ చెప్పారు. దీపావ‌ళి కానుక‌గా అఖిల్ ఈనెల 11న రిలీజ‌వుతోంది. అంత‌వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.