Begin typing your search above and press return to search.

చిరు కష్టం గురించి వినాయక్..

By:  Tupaki Desk   |   19 Jan 2017 7:45 AM GMT
చిరు కష్టం గురించి వినాయక్..
X
‘ఖైదీ నెంబర్ 150’ చూసిన వాళ్లందరూ మెగాస్టార్ చిరంజీవి లుక్ గురించే మాట్లాడుకున్నారు. ఆయన వయసు పదేళ్లు తగ్గిందని.. చిరు చివరి సినిమా ‘శంకర్ దాదా జిందాబాద్’లో కంటే ఇందులోనే అందంగా కనిపించారని కాంప్లిమెంట్లు ఇచ్చారు. ఐతే చిరు ఆ లుక్ లోకి రావడానికి చాలానే కష్టపడ్డట్లు దర్శకుడు వినాయక్ చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం చిరు నోరు కట్టేసుకున్నాడని.. అన్నమే ముట్టుకోలేదని వినాయక్ వెల్లడించాడు.

ఈ సినిమాలో అన్నయ్య అందంగా కనబడితే అదే సగం విజయం అనుకున్నాను. ఆయ‌న సినిమా కోసం చాలా కష్ట‌ప‌డి చాలా అందంగా కనిపించారు. సినిమా చేస్తున్నంత కాలం అన్నం జోలికే వెళ్లలేదు. డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆయన్ని తొలి రోజు షూటింగ్ స్పాట్లో చూసినపుడే చాలా సంతోషించాను. ‘చూడాలని ఉంది’ సినిమాలో ఉన్నట్లుగా ఉన్నారని చెప్పాను. చిరంజీవిగారు ఎలా క‌న‌ప‌డ‌తారో.. ఎలా న‌టిస్తారోన‌ని సినిమాకు ముందు ల‌క్ష ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. అయితే ఆయ‌న వాట‌న్నింటినీ ఫ‌స్ట్ షాట్‌ తోనే ప‌టాపంచ‌లు చేశారు’’ అని వినాయక్ అన్నాడు.

తన స్వస్థలమైన చాగల్లు చిన్న ఊరని.. అలాంటి చోట కూడా రూ.5 లక్షలు వసూలు చేసి ‘ఖైదీ నెంబర్ 150’ సంచలనం సృష్టించిందని.. దీన్ని బట్టే సినిమా ఎంత పెద్ద సక్సెసో అర్థం చేసుకోవచ్చని వినాయక్ అన్నాడు. చిరంజీవి మీద ఉన్న ప్రేమను ప్రేక్షకులు కలెక్షన్ల రూపంలో అందిస్తున్నారని వినాయక్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/