Begin typing your search above and press return to search.
స్టార్ హీరోల రేంజ్ లో డైరెక్టర్ డెబ్యూ
By: Tupaki Desk | 17 Sep 2019 4:25 AM GMTఒకప్పుడు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన వివి వినాయక్ ఇప్పుడు హీరోగా మారిన సంగతి తెలిసిందే. మాములుగా బొద్దుగా ఉండే వినాయక్ ఈ మూవీ కోసమే స్లిమ్ గా మారడం చూసి ఇండస్ట్రీ సన్నిహితులు సైతం షాక్ తిన్నారు. శరభ ఫేమ్ ఎన్ నరసింహరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అఫీషియల్ గా వచ్చే నెల లాంచ్ చేసి 10న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఏర్పాట్లలో టీమ్ ఉన్నట్టు సమాచారం. అయితే దీని కథకు సంబంధించిన ఒక కీలక అప్ డేట్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
దాని ప్రకారం ఇందులో వినాయక్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. ఒకటి 1940 నేపథ్యంలో సాగితే మరొకటి 1980 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలిసింది. తండ్రిగా తాతయ్యగా వయసు వ్యత్యాసం స్పష్టంగా కనిపించేలా శరీరంలో మార్పులు చేసుకున్న వినాయక్ దీని కోసం బాగానే కష్టపడినట్టు కనిపిస్తోంది. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తుందట. తర్వాత వర్తమానానికి లింక్ చేసి వినాయక్ లోని అన్ని యాక్టింగ్ యాంగిల్స్ ని బయటికి తీయబోతున్నట్టు వినికిడి.
అంతా బాగానే ఉంది కానీ కెరీర్ లో ఇంత లేట్ గా వినాయక్ హీరో అవతారం ఎత్తడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అందులోనూ ఇలాంటి రిస్కీ స్టోరీని ఎంచుకున్నారంటే దాన్ని బట్టి పెద్ద ఛాలెంజ్ నే టేకప్ చేసినట్టు అర్థమవుతోంది. గతంలో ఇలా హీరోలుగా దాసరి లాంటి వాళ్ళు ఓ మాదిరిగా సక్సెస్ అయితే ఎస్వి కృష్ణారెడ్డి లాంటి దర్శకులు ఫెయిల్యూర్స్ చవి చూశారు. మరి వివి వినాయక్ ఏ క్యాటగిరీలోకి వస్తాడో వేచి చూడాలి