Begin typing your search above and press return to search.

వినాయ‌క్ వి-మ్యాక్స్ అమ్మేశారా?

By:  Tupaki Desk   |   21 Oct 2018 4:25 AM GMT
వినాయ‌క్ వి-మ్యాక్స్ అమ్మేశారా?
X
మెగా డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ వైజాగ్‌ లో ఓ భారీ సినీమ‌ల్టీప్టెక్స్‌ ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌దాంబ సెంట‌ర్‌ కి కూత‌వేటు దూరంలో వి-మ్యాక్స్ పేరుతో ఈ మ‌ల్టీప్టెక్స్‌ ని ఆయ‌న ర‌న్ చేస్తున్నారు. అప్ప‌ట్లో హుద్‌ హుద్ టైమ్‌ లో వి-మ్యాక్స్ కూడా పెద్ద దెబ్బ తిన్న‌ద‌న్న ప్ర‌చారం సాగింది. అదంతా అటుంచితే నిత్యం జ‌న‌సందోహంతో కోలాహ‌లంగా ఉండే వి-మ్యాక్స్‌ ను వినాయ‌క్ అమ్మేస్తున్నార‌ని - డి-మార్ట్ యాజ‌మాన్యం దీనిని కొనేసింద‌ని సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం సాగుతోంది.

ఈ డీల్ ఇప్ప‌టికే పూర్త‌యింది. డిమార్ట్ గ్రూప్స్ దాదాపు రూ. 35కోట్లకు కొనుక్కుంది. మ‌రో ఏడాదిలో దీని రూపం మార‌నుంది.. అంటూ సామాజిక మాధ్య‌మాల్లో ఈ వార్త దావాన‌లంలా చుట్టేస్తోంది. అయితే ఉన్న‌ట్టుండి - ఇలా వైజాగ్ వి-మ్యాక్స్ ని అమ్మేయ‌డానికి కార‌ణ‌మేంటి? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినీ కాంప్లెక్స్ లో మొత్తం మూడు స్క్రీన్స్ రన్ అవుతున్నాయి. నిరంత‌రం ర‌ద్ధీగా ఉండే కాంప్లెక్స్ ఇది. భారీగా ఆదాయం తెచ్చే చోటు కూడా. అయితే వినాయ‌క్ .. వేరొక చోట వి-మ్యాక్స్ త‌ర‌హా ప్లాన్ చేశారా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆది (2002) సినిమాతో ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించిన వినాయ‌క్ - దిల్ - ఠాగూర్ - బ‌ద్రీనాథ్ - అదుర్స్ - ఖైదీ నంబ‌ర్ 150 - ఇంటెలిజెంట్‌.. ఇలా ఎన్నో సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ్లాక్‌ బ‌స్ట‌ర్ల‌తో సంచ‌ల‌నాలు న‌మోదు చేశారు. ఇక వినాయ‌క్ సొంత ప్లేసు చాగ‌ల్లు (ప‌.గో జిల్లా). అందుకే ఆయ‌న ద‌ర్శ‌కుడిగా బూమ్లో ఉన్న‌ప్పుడు గోదావ‌రి జిల్లాల్లో కొన్ని ఎక‌రాల్లో మామిడి తోట‌లు కొన్నార‌న్న ప్ర‌చారం ఉంది.