Begin typing your search above and press return to search.

అదుర్స్-2 లేదంటే ఆది-2

By:  Tupaki Desk   |   28 Dec 2015 6:05 AM GMT
అదుర్స్-2 లేదంటే ఆది-2
X
ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టిన దర్శకుడు వి.వి.వినాయక్. అతడి తొలి సినిమా ‘ఆది’తోనే ఎన్టీఆర్ మాస్ హీరోగా నిలబడ్డాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సాంబ’ నిరాశ పరిచినా.. ‘అదుర్స్’తో మళ్లీ హిట్టు కొట్టారు. ఇక ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే తామిద్దరం అతి త్వరలో మళ్లీ కలిసి సినిమా చేస్తామని అంటున్నాడు వినాయక్. నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్లో వినాయక్ మాట్లాడుతూ.. ‘‘తారక్, నేను కలిసి అతి త్వరలో సినిమా చేస్తాం. అది అదుర్స్-2నా లేదంటే ఆది-2నా అన్నది చెప్పలేను. కానీ త్వరలోనే సినిమా మాత్రం చేస్తాం’’ అని వినాయక్ చెప్పాడు.

‘నాన్నకు ప్రేమతో’ గురించి చెబుతూ.. ‘‘ఎన్టీఆర్ మామూలుగానే చాలా బాగా నటిస్తాడు. ఈ సినిమాలో కచ్చితంగా ఇంకా బాగా చేసుంటాడు. ఎందుకంటే ఎందుకంటే తారక్ కు వాళ్ల నాన్న గారంటే ప్రాణం. ఎంతో ఇష్టం. తను పది మాటలు మాట్లాడితే నాలుగు మాటలు తన తండ్రి గురించే మాట్లాడతాడు. అందుకే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను ఇంకా ఓన్ చేసుకుని బాగా నటించి ఉంటాడు. ఈ చిత్రాన్ని మా గురువుగారైన సత్యమూర్తి గారికి అంకితమివ్వడం చాలా సంతోషం. నేను కూడా ఆ కుటుంబ సభ్యుడినే. సినీ పరిశ్రమలో నా తొలి రోజుల్లో ఆయనతో కలిసి పని చేశా. దేవిశ్రీ అప్పుడు చిన్న పిల్లోడు. చిన్న వయసులోనే మ్యూజిక్ ప్లే చేసేవాడు. అది చూసి సత్యమూర్తిగారు చాలాసంతోషించేవాళ్లు. దేవి వాళ్ల నాన్న అనుకున్నదాని కంటే ఇప్పుడు ఎక్కువ సాధించాడు. తండ్రులంటే విపరీతంగా ప్రేమించే అందరూ ఈ సినిమాకు పని చేశారు. కాబట్టి ఈ సినిమా అద్భుతంగా వచ్చి ఉంటుందని అనుకుంటున్నా’’ అని వినాయక్ అన్నాడు.