Begin typing your search above and press return to search.
డబ్బు కోసం కక్కూర్తి పడని వినాయక్
By: Tupaki Desk | 1 April 2017 6:11 PM GMTమామూలుగా స్టార్ డైరక్టర్లకు ఈరోజుల్లో 10 కోట్లు ఇట్టే ముట్టేస్తున్నాయి. దానికి తగ్గట్లు వారు కూడా సినిమాలతో మాంచి లాభాలు తెచ్చిస్తూనే ఉన్నారు. అయితే వి.వి.వినాయక్ విషయంలో మాత్రం.. కొత్త కుర్రాడు అల్లుడు శీను ను లాంచ్ చేసి.. అరే ఇతనితో కూడా హీరోయిజం బాగా పండించాడే అనిపించుకున్న డైరక్టర్.. అఖిల్ సినిమా తరువాత.. ఓ కొత్త కుర్రాడి ఫ్యూచర్ కు అలా దెబ్బేశారేంటి మాష్టారూ అనే క్రిటిసిజం ఎదుర్కొన్నాడు. దానితో ఇప్పుడు సీన్ మారిపోయింది.
నిర్మాత సి.ఆర్.మనోహర్ కు కజిన్ అయిన ఇషాన్ ను ఇప్పుడు పూరి జగన్ ''రోగ్'' అంటూ లాంచింగ్ చేశాడు. ఈ సినిమా రిజల్టు ఎలా ఉన్నా కూడా.. రోగ్ సినిమా చూస్తే మాత్రం ఈ హీరో డైలాగులు బాగానే చెప్పాడులే అని మనం అనుకోవచ్చు. అయితే ఈ హీరోను కనుక లాంచింగ్ చేస్తే వినాయక్ కు దాదాపు 15 కోట్లు ముట్టజెపుతాం అంటూ నిర్మాత మనోహర్ కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చాడట. కాని వినాయక్ మాత్రం.. అఖిల్ స్ర్టోక్ తో బాగా కళ్ళు తెరుచుకుని.. నేను స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటాను ఈ కాసుల కోసం కక్కూర్తి పడి కొత్త కుర్రాళ్ళతో అనవసరంగా ప్రయోగాలు చేయను సార్ అంటూ ఈ సినిమా ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించేశాడు.
ఆ తరువాత మెగాస్టార్ చిరు ఆహ్వానంతో ''ఖైదీ నెం 150'' సినిమాను తీసి.. తొలిసారి తన కెరియర్ లో ఒక 100 కోట్ల షేర్ సినిమాను ఖాతాలో వేసుకున్నాడు వినాయక్. ఇప్పుడు మనోడు ఏ హీరోతో సినిమాను చేస్తున్నాడో ఇంకా క్లారిటీ లేదు కాని.. ఒక స్టార్ హీరోతోనే తన తదుపరి సినిమా అంటున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/