Begin typing your search above and press return to search.
తెర వెనుక కథ చెబుతున్న వినాయక్
By: Tupaki Desk | 2 Nov 2017 4:28 AM GMTసినిమా తెరవెనుక ఉండి స్టార్ట్.. కెమెరా అని చెప్పే డైరెక్టర్లలో కొంతమంది సరదాగా సినిమాలో అలా ఒకటి, రెండు సెకన్లు ఉండి కనిపించే వెళ్లిపోయే పాత్రల్లో అప్పుడప్పుడు చేస్తుంటారు. డైరెక్టర్ వి.వి.వినాయక్ కూడా ఠాగూర్ సినిమాలో కూడా ఇలాగే ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ఓ సినిమాలో వి.వి. వినాయక్ వినిపించబోతున్నాడు. ప్రేక్షకులకు సినిమాలో కథాంశాన్ని బ్యాక్ గ్రౌండ్ లో చెప్పబోతున్నాడు.
నాగ అన్వేష్ - హెబ్బాపటేల్ జంటగా నటించిన ఏంజెల్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు వి.వి. వినాయక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సాధారణంగా హీరోలు వాయిస్ ఓవర్లు ఇవ్వడం మామూలే అయినా డైరెక్టర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అరుదనే చెప్పాలి. ప్రేక్షకులందరికీ బాగా పరిచయం ఉన్న గొంతుతో వాయిస్ ఓవర్ చెప్పిస్తే బాగుంటుందని భావించి ఈ సినిమా యూనిట్ వి.వి.వినాయక్ ను సంప్రదించింది. వాళ్ల రిక్వెస్ట్ ఓకే చేయడమే కాకుండా వెంటనే రికార్డింగ్ కు అటెండై తన పని పూర్తి చేశాడని వినాయక్ సన్నిహితుడు ఒకరు తెలిపారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ ఇంట్లో ఇల్లాయి .. వంటిట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన బాలనటుడే నాగ అన్వేష్. ఇప్పుడు ఏంజెల్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేస్తున్నాడు. హెబ్బా పటేల్ దివి నుంచి దిగివచ్చిన దేవకన్య పాత్రలో కనిపించనుంది. చాలారోజుల తరవాత తెలుగులో వస్తున్న సోషియో ఫాంటసీ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.