Begin typing your search above and press return to search.
వ్యవస్థ ట్రైలర్.. సిస్టమ్ తో ఫైట్!
By: Tupaki Desk | 20 April 2023 5:09 PM GMTఈ మధ్య కాలంలో సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో వెబ్ సిరీస్ లకు కూడా అంతే క్రేజ్ ఉంటోంది. వెబ్ సిరీస్ లను చూసేందుంకు కూడా అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోహీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లలో నటించడం గమనార్హం. అయితే తాజాగా హెబ్బా పటేల్, కార్తీక్ రత్నం, కామ్నా జఠ్మలానీ, సంపత్ రాజ్ కాంబోలో ఓ వెబ్ సిరీస్ రాబోతుంది.
ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ పేరు "వ్యవస్థ". అయితే జీ5 ఓటీటీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సిరీస్ ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. అందులో సంపత్ రాజ్, అవినాష్ చక్రవర్తి పాత్రలో విలన్ గా కనిపిస్తుండగా.. కార్తీక్ రత్నం.. వంశీ పాత్రతో హీరోగా మెప్పించబోతున్నాడు. అలాగే యామిని (హెబ్బా పటేల్) కేసును టేకప్ చేసిన కార్తీక్.. సంపత్ రాజ్ ను ఎదురొడ్డి ఎలా నిలుస్తాడన్నదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ.
ముఖ్యంగా వంశీకృష్ణ (కార్తీక్ రత్నం) నత్తి సమస్యతో బాధపడుతూ ఆత్మ విశ్వాసమే లేని లాయర్ పాత్రలో కార్తీక్ రత్నం అదరగొట్టాడు. ప్రాక్టీస్ చేయడానికి కూడా భయపడే ఇతడు.. తన మాజీ ప్రేయసి (హెబ్బా పటేల్) ఓ హత్య కేసులో నిందితురాలు అని తేలడంతో... కేసును టేకప్ చేస్తాడు. తనకు ఎదురుగా నిలబడ్డ సీనియర్ లాయర్ సంపత్ రాజ్ ను ఎదిరించడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈయన సిస్టంను మార్చాడా, సిస్టమే ఈయనను మార్చిందా అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
అయితే గోపీచంద్ రణం సినిమాలో కథానాయికగా నటించి మెప్పించిన కామ్నా జఠ్మలాని ఇన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. పెళ్లి, పిల్లలతో యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చిన ఆమె.. ఈ వెబ్ సిరీస్ తోనే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో గాయత్రిగా కనిపించబోతున్నారు.
అంతేకాకుండా కల్పికగా.. సుకృతా వాగ్లే, సంయుక్త పాత్రలో శివాని, తేజగా సుజిత్ కుమార్ రెడ్డి, స్మరన్‌గా రాజా అశోక్, అప్పారావుగా గురురాజ్ లు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. అయితే ఈ వ్యవస్థ అనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీ నుంచి జీ5 ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేందుకు రెడీగా ఉండండి మరి.