Begin typing your search above and press return to search.
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ .. వైజయంతీ మూవీస్!
By: Tupaki Desk | 15 Sep 2022 10:40 AM GMTటాలీవుడ్ కి సంబంధించి ఒకప్పుడు నిర్మాతగా రామానాయుడు తరువాత ఆ స్థాయిలో వినిపించిన పేరు అశ్వనీదత్. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఆయన పేరును చెప్పుకున్నారు. సాధారణంగా కొంతమంది ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగాలనే ఆలోచనతో వస్తుంటారు. కానీ ఎలాగైనా ఎన్టీరామారావుతో సినిమాను నిర్మించాలనే ఒక పట్టుదలతో అశ్వనీదత్ ఇండస్ట్రీకి వచ్చారు. ఎన్టీ రామారావుతో తన ఫస్టు సినిమాను నిర్మించడమే కాదు .. సొంత బ్యానర్ కి ఎన్టీఆర్ చేతనే పేరు పెట్టించడం .. ఎన్టీఆర్ విజయ శంఖం పూరిస్తున్న స్టిల్ ను 'లోగో'గా సెట్ చేయడం అశ్వనీదత్ కే చెల్లింది.
అలా ఎన్టీ రామారావు హీరోగా 'ఎదురులేని మనిషి' సినిమాతో వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రస్థానం మొదలైంది. అశ్వనీదత్ కెరియర్ ను పరిశీలిస్తే, నిర్మాతగా ఆయన ఎంత ప్లానింగుతో ముందుకు వెళ్లారనేది కనిపిస్తుంది. ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేసిన ఆయన ఆ తరువాత ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు .. చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ .. పవన్ .. ఎన్టీఆర్ లతో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. చిరంజీవితో ఆయన నిర్మించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా అప్పటికీ .. ఇప్పటికీ ఒక సంచలనమే.
ఇక వైజయంతి బ్యానర్ కి మరో ప్రత్యేకత ఉంది. స్టార్ హీరోలు తమ వారసులను ఈ బ్యానర్ ద్వారా పరిచయం చేయడానికి ఎక్కువగా ఆసక్తిని .. ఉత్సాహాన్ని చూపించేవారు. 'రాజకుమారుడు' ద్వారా మహేశ్ బాబు .. 'చిరుత' ద్వారా చరణ్ .. 'గంగోత్రి' ద్వారా బన్నీ ఈ బ్యానర్ ద్వారానే పరిచయమయ్యారు.
ఇప్పుడు ఈ ముగ్గురు ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నారనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇక మరో విశేషం ఏమిటంటే 'స్టూడెంట్ నెంబర్ 1' సినిమాతో దర్శకుడిగా రాజమౌళి పరిచయమైంది కూడా ఈ బ్యానర్ పైనే.
ఇలా ఎన్నో విశేషాలకు .. ప్రత్యేకతలకు వేదికగా వైజయంతి బ్యానర్ కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన 'మహానటి' .. 'జాతిరత్నాలు' .. 'సీతా రామం' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఒక్కో జోనర్లో ఒక్కో సినిమాను చేస్తూ హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రభాస్ తో 'ప్రాజెక్టు K' సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కొంతవరకూ జరిగింది. వచ్చే ఏడాదిలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాను గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. నిర్మాతగా సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్న అశ్వనీదత్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన మరెన్నో విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.