Begin typing your search above and press return to search.
వైజయంతి మూవీస్.. అల్లుడు తెచ్చిన విజయాలు
By: Tupaki Desk | 6 Aug 2022 6:30 AM GMTఎప్పుడైనా సరే టాలెంట్ అనేది చాలా ముఖ్యం ఒకసారి అపజయం వచ్చినా కూడా మరోసారి టాలెంట్ ను బట్టి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇటీవల వైజయంతి మూవీస్ లో ఇద్దరు డిజాస్టర్ దర్శకులు మళ్లీ అవకాశాలు అందుకొని సక్సెస్ అయ్యారు. జాతి రత్నాలు సినిమా కంటే ముందు అసలు అనుదీప్ అంటే ఎవరో కూడా తెలియదు అతను అంతకుముందే సురేష్ ప్రొడక్షన్ లో పిట్టగోడ అనే సినిమా తీశాడు. కానీ ఆ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికి తెలియదు.
ఆ డిజాస్టర్ అనంతరం అవకాశాలు లేక ఖాళీగా ఉండిపోయిన అనుదీప్ షార్ట్ ఫిలిమ్స్ తీసే టైమ్ లోనే అతని టాలెంట్ చూసి దర్శకుడు నాగ్ అశ్విన్ అతనికి మాట ఇచ్చాడు. ఇక అనుకున్నట్టే వైజయంతి వారి అనుబంధ సంస్థ స్వప్న సినిమాలో జాతి రత్నాలు అనే సినిమా చేశారు. అందులో నాగ్ అశ్విన్ సలహాలు డిసిషన్ చాలానే ఉన్నయు. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన సీతారామం సినిమా దర్శకుడు హను రాఘవపూడి అసలు మరో సినిమా తీస్తాడు అనే అనుమానాలు వచ్చాయి.
ఇంతకుముందు అతను తీసిన లై, పడి పడి లేచే మనసు నిర్మాతలను దారుణంగా దెబ్బకొట్టాయి. అలాంటి దర్శకుడికి మళ్లీ నాగ్ అశ్విన్ సలహా మేరకు వైజయంతి మూవీస్ లో సీతారామంలో సినిమా చేసే అవకాశం దక్కింది.
ఏదేమైనా కూడా నాగ్ అశ్విన్ వచ్చిన తర్వాత వైజయంతి మూవీ వారి జాతకమే మారిపోయింది. అంతకుముందు వీరి సంస్థలో 2002 లో ఇంద్ర తరువాత సరైన సక్సెస్ పడలేదు. కంత్రి, శక్తి దారుణంగా దెబ్బకొట్టాయి.
ఇక నాగ్ అశ్విన్ మొదట ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో అశ్వినీ దత్ కూతుళ్ళతో ఒక సినిమా చేశాడు. ఆయన పెద్ద కూతురు స్వప్న నిర్మించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే సినిమాతో అశ్విని దత్ చిన్న కూతురు ప్రియాంకతో నాగ్ అశ్విన్ ప్రేమలో పడ్డాడు.
ఇక వారి పెళ్లి అనంతరం వైజయంతి ప్రొడక్షన్లో మహానటి అనే సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. అనంతరం ప్రాజెక్ట్ K ను లైన్లోకి తీసుకువచ్చాడు. ఇక ఇప్పుడు అతని సలహా మేరకే అనుదీప్, హను రాఘవపూడి ఆ ప్రొడక్షన్లో అవకాశాలు వచ్చాయి. నిర్మాతగా కూడా అశ్వినీ దత్ కు మంచి లాభాలు వచ్చాయి. ఏదేమైనా అల్లుడుగారు రాకతో వైజయంతి మూవీస్ జాతకమే మారిపోయింది అని చెప్పవచ్చు.