Begin typing your search above and press return to search.

మహానటిని గౌరవించమంటున్న వైజయంతి

By:  Tupaki Desk   |   12 May 2018 5:36 AM GMT
మహానటిని గౌరవించమంటున్న వైజయంతి
X
కొన్ని సినిమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే చూడాలి. అలా చూస్తే కలిగే అనుభూతే వేరు. అందులోనూ నిజాయితీగా ఒక గొప్ప ప్రయత్నం చేసినపుడు ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ప్రోత్సహించాల్సిందే. ‘మహానటి’ ఆ కోవలోని సినిమానే. దానికి అలాంటి ఆదరణే దక్కాలి. ఇలాంటి సినిమాను కూడా పైరసీ చేసేవాళ్లు.. చూసేవాళ్లు లేకుండా పోరు. ఐతే దయచేసి అలా చేయొద్దంటూ చిత్ర నిర్మాణ సంస్థలు వైజయంతీ మూవీస్.. స్వప్న సినిమా తరఫున పిలుపునిచ్చాయి. ఈ విషయంలో ప్రేక్షకుల్ని ఉద్దేశించి హృద్యంగా ఒక సందేశాన్నిస్తూ ఇస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది.

మహానటి కోట్లాది మంది అభిమానుల అమ్మ కథ అని.. సావిత్రి గురించి ఈ తరానికి తెలియజేయాలని.. రేపటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ చిత్రమని.. నిజాయితీగా ఒక ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి తప్పక ఆదరణ ఉంటుందని రుజువు చేశారని.. ఇందుకు ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలని వైజయంతీ మూవీస్.. స్వప్న సినిమా తరఫున చెప్పారు. ఈ చిత్రం ఒక దర్శకుడి కృషి.. వందలాది కళాకారులు మూడేళ్ల పాడు పడ్డ కష్టం.. ఇద్దరు ఆడపిల్లల కల అంటూ చాలా హృద్యంగా చెప్పే ప్రయత్నం చేస్తూ.. పైరసీ చేయకండి. చూడకండి.. థియేటర్లకు రండి అని పిలుపునిచ్చారు.

ప్రేక్షకుల సౌకర్యార్థం ఈ చిత్ర థియేటర్లను కూడా పెంచామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పైరసీని ప్రోత్సహించవద్దని.. అదే మనందరం ఆ మహానటికి ఇచ్చే ఘన నివాళి అని చెప్పారు. నిర్మాణ సంస్థలు చెప్పాయనే కాదు కానీ.. ‘మహానటి’ లాంటి ప్రయత్నాలు చాలా చాలా అరుదు. అది నిజంగా నిజాయితీతో కూడిన గొప్ప ప్రయత్నం. ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రావు. ఒక కమిట్మెంట్‌ తో తీసిన ఇలాంటి సినిమాల్ని థియేటర్లలో చూసి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రేక్షకులపై ఉంది.