Begin typing your search above and press return to search.

వైజయంతికి అసలైన విజయం

By:  Tupaki Desk   |   11 May 2018 1:30 AM GMT
వైజయంతికి అసలైన విజయం
X
టాలీవుడ్ లో పేరు గాంచిన ప్రొడక్షన్ లు చాలానే ఉన్నాయి. డైరెక్టర్ ఎలాంటి వారైనా ఓ సంస్థ నుంచి సినిమా వస్తోంది అంటే ఆ సినిమాలో ఎదో ఒక స్పెషల్ ఉంటుందని జనాలు చర్చించుకోవడం చాలా తక్కువ. కానీ ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ నుంచి వచ్చే సినిమాలకు కూడా ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. వచ్చే సినిమా ఎలాంటిదైనా సరే సంచలనం సృష్టించడం ఖాయమని ఎన్నో సందర్భాల్లో రుజువయ్యింది. ఎన్టీఆర్ తో గెలుపుతో స్టార్ట్ అయినా ఆ సంస్థ 2002 వరకు ఎన్నో ఇండస్ట్రీ హిట్ లను అందుకుంది.

ముఖ్యంగా జగదేక వీరుడు తో తిరుగులేని సంస్థగా ఎదిగి ఇంద్ర సినిమాతో రికార్డు స్థాయిలో లాభాలను అందుకుంది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడంలో ఆ సంస్థ ఎప్పుడు ముందడుగు వేస్తూనే వచ్చింది. కానీ గత పదేళ్లుగా సంస్థకి వరుస పరాజయాలు చుట్టుముట్టాయి. 2007 లో చిరుత తప్పితే ఆ తరువాత అన్ని డిజాస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తో చేసిన కంత్రి - శక్తి సినిమాలు సంస్థని గట్టి దెబ్బ కొట్టాయి. వైజయంతి వారి పరిస్థితి ఇలా అయ్యిందేంటి అని అంతా అనుకున్నారు. ఆ మధ్యలో సంస్థ అధినేత అశ్వినీదత్ కూతుళ్లు స్వప్న బ్యాన్నర్ లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను తెరకెక్కించి కొంచెం ఊపిరి పోశారు.

కానీ ఆ సినిమాలు అఫీషియల్ గా వైజయంతి మూవీస్ నుంచి రిలీజ్ కాలేదు. పెద్దగా లాభాలు కూడా రాలేదు. అలా అని నష్టపోలేదు. అనంతరం ఆ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రియాంకా వివాహం జరగడంతో అతన్ని నమ్మి ప్రతిష్టాత్మక మహానటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సినిమా ఏ స్థాయిలో లాభాన్ని అందుకుంటుందో గాని వైజయంతి గొప్పతనంకి అందరూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. నిజాయితీగా దైర్యంగా సావిత్రమ్మ జీవితాన్ని తెరపై చూపించినందుకు భావోద్వేగానికి లోనవుతూ చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తున్నారు. చూస్తుంటే కలెక్షన్స్ కూడా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆలస్యంగా హిట్టు కొట్టినా వైజయంతి వారు మంచి సినిమాతో విజయం అందుకున్నారని చెప్పవచ్చు.