Begin typing your search above and press return to search.
కరోనా పోయినా థియేటర్లలో క్రేజీ సినిమాలేవీ..?
By: Tupaki Desk | 13 Nov 2021 4:30 PM GMTసెకండ్ వేవ్ అనంతరం గజగజ ఒణికిపోయిన జనం ఇప్పుడు స్వేచ్ఛగా పబ్లిక్ లో ఊపిరి పీల్చుకుంటున్నారు. మాస్క్ లేకుండా జనం గుంపులు గుంపులుగా తండోప తండోపాలుగా తిరిగేస్తున్నారంటే భయం ఎటెళ్లిపోయిందో ఊహించాలి. ప్రేక్షకుల్లో కరోనా భయం దాదాపు తొలగిపోయింది. జనాలంతా వినోదం కోసం థియేటర్లవైపు మళ్లు తున్నారు. సినిమాకి మౌత్ టాక్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ ఫీల్ ని ఆస్వాధించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సరైన కంటెంట్ ఉన్న సినిమాలే ఇప్పుడు కరువవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చిన్న సినిమాల రిలీజ్ లకు కలిసొచ్చే కాలమే ఇది అనుకోవాలి. మార్కెట్ లో పెద్ద సినిమాలేవి లేని నేపథ్యంలో విషయం ఉంటే చిన్న సినిమా అయినా ప్రేక్షకులకు థియేటర్ కు ఎందుకు రారు? అన్న వాదన మరోసారి తెరపైకి వచ్చింది.
`లవ్ స్టోరీ`..`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ `..`మంచి రోజులు వచ్చాయి` సక్సెస్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కాలేదని బాక్సాపీస్ వసూళ్లు చెప్పకనే చెబుతాయి. ప్రతీ శుక్రవారం రిలీజ్ అయిన సినిమా ఫలితాలు చెక్ చేస్తే ఇటీవల అన్నీ మ్యాటర్ లేనివే రిలీజయ్యాయని తెలిసిపోతుంది. తాజాగా ఈ శుక్రవారం `తెలంగాణ దేవుడు`.. `పుష్పక విమానం`..`కురుప్`..`రాజా విక్రమార్క` సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలంగాణ దేవుడికి పెద్దగా ప్రచారం లేదు. ఆ సినిమా ఆడియన్స్ కి అంతగా రీచ్ అవ్వలేదు. `కురుప్` సినిమా మినహా అన్నింటికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. `పుష్పక విమానం`..`రాజా విక్రమార్క` భారీ అంచనాలతో రిలీజ్ అయినా నిరాశ తప్పలేదు.
ఇవన్నీ మౌత్ టాక్ దక్కించుకోవడంలో విఫలమయ్యాయి. `కురుప్` సినిమాకు మంచి టాక్ వస్తున్నా తక్కువ థియేటర్లో రిలీజ్ అవ్వడం ఆ సినిమాకి మైనస్ గా కనిపిస్తోంది. ఆ రకంగా ఈ శుక్రవారం ప్రేక్షకుడికి సరైన ఎంటర్ టైన్ మెంట్ దొరకలేదనేది టాక్. రానున్న రోజుల్లో చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. `పుష్ప`..`అఖండ`..`ఖిలాడీ` చిత్రాలు బరిలో ఉన్నాయి. ఇవి వచ్చే నెలలో రిలీజ్ అవుతున్నాయి. ఈ గ్యాప్ లో చిన్నసినిమాలు అనువాదాలతో ఎంటర్ టైన్ అవ్వాల్సిందే.