Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ విలన్ రియాక్షన్ ఏంటో
By: Tupaki Desk | 23 Feb 2019 1:30 AM GMTఎన్టీఆర్ మహానాయకుడు వచ్చేసింది. ప్రేక్షకులకు నచ్చిందా లేదా వసూళ్లు ఎంత రావొచ్చు అనే లెక్కలు పక్కన పెడితే ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పక్కనే ఉంటూ కాంగ్రెస్ హయంలో ఇందిరా గాంధీతో చేతులు కలిపి తెలుగుదేశం పతనానికి పన్నాగం చేసాడని నాదెండ్ల భాస్కర్ రావు గారిని మాములు విలన్ గా చూపెట్టలేదు. ఇంకెవరి తప్పూ లేదు మొత్తం చేసారనేలా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ దాకా మొత్తం ఆయన్నే ప్రతినాయకుడిని చేసారు.
ఏ యాంగిల్ లోనూ నాదెండ్ల భాస్కర్ రావు ని పొరపాటున కూడా పాజిటివ్ గా చూపలేదు. అంతటి ప్రమాదకరమైన వ్యక్తిని చాలా క్యాలికులేటెడ్ గా ఉండే ఎన్టీఆర్ గుడ్డిగా ఎలా నమ్మి పక్కన పెట్టుకున్నారు అనే లాజిక్ ని పక్కన పెడితే ఇప్పుడీ సినిమా చూసి నాదెండ్ల భాస్కర్ రావు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైనప్పుడు చివర్లో చూపించే రెండు మూడు సన్నివేశాలకే ఆయన రియాక్ట్ అయ్యారు.
పలు ఇంటర్వ్యూలలో తనను అనవసరంగా చెడుగా చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ వ్యక్తిగతానికి సంబంధించిన చాలా దారుణమైన విషయాలు ఆయన ఓపెన్ గా షేర్ చేసుకున్నాడు. ఇప్పుడీ సినిమాలో తనను మరీ ఇంత నెగటివ్ గా చూపించారని తెలిస్తే ఇంకేం మాట్లాడతారో అని మీడియా వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. కథానాయకుడులో ప్రీ క్లైమాక్స్ లో రెండు సీన్లకే అగ్గి మీద గుగ్గిలం అయిన భాస్కర్ రావు గారు ఇప్పుడీ మహానాయకుడులో తనే మెయిన్ విలన్ అని తెలిస్తే. చూద్దాం ఎలాంటి బాంబులు పేలుస్తారో