Begin typing your search above and press return to search.
సాయి పల్లవి డ్రీమ్ మూవీ కోసం వెయిటింగ్!
By: Tupaki Desk | 25 July 2020 3:30 AM GMTప్రేమమ్.. ఫిదా చిత్రాలతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తుంది. డాన్స్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన సాయి పల్లవి ఇప్పటి వరకు పూర్తి స్థాయి తన డాన్స్ ప్రతిభను చూపించలేక పోయాను అంటూ బాధపడుతుందట. హీరోలతో కలిసి చేయడం వల్ల పూర్తి స్థాయి డాన్స్ ప్రతిభను ప్రదర్శించడం సాధ్యం కావడం లేదనేది ఆమె అభిప్రాయమట. అందుకే ఒక డాన్స్ ప్రధానమైన లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని చేయాలని ఆశ పడుతుందట.
కథ పూర్తిగా డాన్స్ పై ఆధారపడి ఉండాలి అలాగే అది ఫీమేల్ సంట్రిక్ మూవీ అయ్యి ఉండాలని సన్నిహితుల వద్ద చెబుతుందట. ఆ మూవీ తన డ్రీమ్ మూవీ అని ఖచ్చితంగా త్వరలో అలాంటి సినిమాను చేయాలని ఆశపడుతున్నట్లుగా పేర్కొంది. అలాంటి కథతో వస్తే తెలుగు తమిళం ఏ భాషలో అయినా నటించేందుకు రెడీగా ఉందట. ఇప్పటికే ఒకటి రెండు స్క్రిప్ట్ లు విన్నా కూడా అవి పూర్తి స్థాయిలో నచ్చలేదట.
ప్రస్తుతం ఈమె తెలుగులో విరాటపర్వం చిత్రంతో పాటు లవ్ స్టోరీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు మరియు తమిళంలో కలిపి మొత్తం నాలుగు సినిమాల్లో ఈమె నటిస్తుందట. స్కిన్ షో కు నో చెబుతూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వస్తున్న సాయి పల్లవి డాన్స్ బేస్డ్ కథతో సినిమా చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులకు ఆమె డాన్స్ వింధు ఖాయం అంటున్నారు.