Begin typing your search above and press return to search.

'సలార్' అప్ డేట్ కోసం వెయిటింగ్‌

By:  Tupaki Desk   |   12 Jan 2021 1:30 PM GMT
సలార్ అప్ డేట్ కోసం వెయిటింగ్‌
X
యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' షూటింగ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్‌' సినిమా లో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే సినిమా అధికారిక ప్రకటన రావడంతో పాటు జనవరిలోనే షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పడంతో ఎప్పుడెప్పుడు సినిమా అప్‌ డేట్‌ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సలార్‌ సినిమా షూటింగ్‌ కు సంబంధించిన అప్‌ డేట్‌ ను సంక్రాంతి కానుకగా ప్రకటించే అవకాశం ఉందని ప్రభాస్ అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. కేజీఎఫ్‌ 2 సినిమా షూటింగ్‌ విషయంలో కాస్త జాప్యం కారణంగానే సలార్ షూటింగ్‌ అప్‌ డేట్ ఆలస్యం అవుతుందనే వార్తలు మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి.

కేజీఎఫ్‌ 2 టీజర్‌ కు అద్బుతమైన రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై అంచనాలు మరో రేంజ్ లో ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కేజీఎఫ్‌ 2 ఉంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఇక కేజీఎఫ్‌ 2 ను మించి భారీ యాక్షన్‌ సీన్‌ లు మరియు అద్బుతమైన విజువల్స్ ను ప్రశాంత్‌ నీల్‌ సలార్ లో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. సలార్‌ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది.. ఎప్పటి వరకు షూటింగ్‌ అవుతుంది.. ఎప్పుడు సినిమా విడుదల కాబోతుంది అనేది ప్రతి ఒక్క అభిమానికి ఆసక్తిగా మారింది. సలార్‌ తో పాటు మరో వైపు ప్రభాస్‌ ఆదిపురుష్‌ షూటింగ్‌ విషయమై కూడా సస్పెన్స్‌ కొనసాగుతోంది.