Begin typing your search above and press return to search.

వాల్తేరు వీరయ్య.. మిస్సైన లాజిక్ లపై బాబీ కామెంట్

By:  Tupaki Desk   |   21 Jan 2023 8:26 AM GMT
వాల్తేరు వీరయ్య.. మిస్సైన లాజిక్ లపై బాబీ కామెంట్
X
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బాబీ.. సినిమాపై పలు కామెంట్లు చేశారు. ఇందులో ఉన్న లాజిక్ లను అధిగమించేందుకు మ్యాజిక్ చేయాల్సి వచ్చిందని వివరించారు. హీరో ఇంట్రడక్షన్ సీన్ లో.. మెగాస్టార్ హీరోయిజం చూపించాడనికి ఇండియన్ నేవీని చిన్నబుచ్చేలా సన్నేవాశాలు రాశారు. అలాగే ఓ స్మగ్లర్ ను పట్టుకోవడానికి, పోలీసులు మరో స్మగ్లర్ సాయం కోరడం వంటి రియాలిటీకి దూరంగా ఉన్నాయి.

అలాగే విలన్ ని పట్టుకోవడానికి విదేశాలకు వెళ్లిన రా అధికారులకు.. మీరు ఇండియా వెళ్లిపోండి, వాడి సంగతి నేను చూసుకుంటానని హీరో చెప్పడం ఓవర్ గా అనిపిస్తుంది. దీనికి రా కూడా ఓకే చెప్పి, వెళ్లిపోవడం నిజంగా నమ్మశక్యం కాని విషయమే.

అలాగే చిరుతో జంబలకిడి జారుమిఠాయి, ఫ్రస్టేటెడ్ న్యూస్ యాంకర్ పేరడీ డైలాగులు చేయించడం కూడా కాస్త రొటీన్ గా ఉన్నాయి. కానీ హీరోలను హైలెట్ చేసేందుకే.. ఇలాంటి లాజిక్ లేని సన్నివేషాలు పెట్టామని డైరెక్టర్ బాబీ తెలిపారు.

ప్రతీ కమర్షియల్ సినిమా విషయంలో వాస్తవికత కోణం కంటే.. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఇలాంటి సీన్లు పెట్టాల్సి వస్తుందని చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడానికి కూడా కారణం ఇదేనని చెప్పారు. ఈ సినిమా ద్వారా పాతకాలపు చిరంజీవి మరోసారి కనిపించారని..

ఆ మాస్ అండ్ గ్రేస్ పెర్ఫార్మెన్స్ చూపించినందుకు అభిమానులు థాంక్స్ చెబుతున్నారని అన్నారు. అభిమానుల ఉత్సాహం బ్లాక్ బస్టర్ వసూళ్ల కంటే తనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని బాబీ చెప్పారు.

ఈనెల 13వ తేదీన విడుదలైన తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే 29.30 కోట్ల షేక్, రెండో రోజు 14.60 కోట్ల షేర్, మూడో రోజు 15.01 కోట్ల షేర్, నాలుగో రోజు 14.77 కోట్ల షేర్, ఐదో రోజు 9.85 కోట్ల షేర్ ను రాబట్టింది. చిరంజీవి కెరియర్ లోనే అత్యంత వేగంగా వంద కోట్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిందీ వాల్తేరు వీరయ్య. క్తి చూపిస్తున్నారు. అయితే మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1545 స్క్రీన్స్ లో విడుదల అయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.