Begin typing your search above and press return to search.
క్రేజీ మేకర్స్ కి కొత్త టెన్షన్..ఏది తగ్గినా ఇబ్బందే!
By: Tupaki Desk | 24 Nov 2022 5:30 AM GMTఇద్దరు సీనియర్ హీరోలు నటించిన సినిమాలు లేదా..?.. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు వివిధ సందర్భాల్లో.. ఫెస్టివెల్ సీజన్ లోనూ పోటీపడిన సందర్భాలు చాలానే వున్నాయి. అయితే ఒకే సంస్థ నిర్మించిన సినిమాలు ఒకే టైమ్ లో పోటా పోటీగా రిలీజ్ అయిన సందర్భాలు మాత్రం ఈ మధ్య కాలంలో చాలా అరుదు అని చెప్పొచ్చు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం ఇద్దరు సీనియర్ హీరోలు తమ సినిమాలతో సై అంటే సై అంటూ సమరానికి కాలు దువ్వుతున్నారు.
సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తమ తమ సినిమాలతో ఈ సంక్రాంతికి పోటీ కి దిగుతున్నారు. చిరంజీవి నటిస్తున్న మాసీవ్ యాక్షన్ డ్రామా `వాల్తేరు వీరయ్య`. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు. ఇలా ఇద్దరు స్టార్ లు నటిస్తున్న సినిమా కావడం, చాలా ఏళ్ల తరువాత బాస్ మళ్లీ గళ్ల లుంగీ ధరించి మాసీవ్ పాత్రలో వీరయ్యగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
`ఆచార్య`, గాడ్ ఫాదర్ సినిమాలు ఆశించిన రిజల్ట్ ని అందించకపోవడంతో చిరు కూడా ఈ మూవీపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఎలాగైనా `వాల్తేరు వీరయ్య`తో హిట్ ని దక్కించుకుని మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలనుకుంటున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి పోటీగా బాలయ్య నటిస్తున్న `వీర సింహారెడ్డి` రాబోతోంది. `అఖండ`తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన బాలకృష్ణ అదే జోష్ ని కంటిన్యూ చేస్తూ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు.
`క్రాక్`తో ట్రాక్ లోకి వచ్చేసిన గోపీచంద్ మలినేని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో కూడా శృతిహాసనే హీరోయిన్. ఈ మూవీని కూడా మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. టీజర్ తో అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ పై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. చాలా ఏళ్ల తరువాత సీమ నేపథ్యంలో బాలయ్య నటిస్తున్న సినిమా కావడం ఇప్పటికే విడుదలైన టీజర్ రచ్చ చేస్తుండటంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది.
ఈ విషయం పక్కన పెడితే ఈ రెండు సినిమాలని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుందట. గతంలో ఈ సంస్థ నిర్మించిన పలు సినిమాల ప్రమోషన్స్ విషయలో లీకుల కారణంగా విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలని సంక్రాంతి బరిలో దించేస్తున్న మైత్రీ వారికిది అత్యంత సవాల్ తో కూడుకున్న సమయం అని అంటున్నారు.
ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఏ సినిమాకు కాస్త తగ్గినా ఫ్యాన్స్ ఆడుకుంటారు. అది జరగకుండా మైత్రీ వారు ఇప్పటికే ఓ టీమ్ ని ఏర్పాటు చేసి రెండు సినిమాల ప్రమోషన్స్ కి సంబంధించిన ప్రణాళికని సిద్ధం చేయించారట. అయినా సరే ఎక్కడ ఏది మిస్సవుతుందోనని టెన్షన్ పడుతున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.