Begin typing your search above and press return to search.

బాలయ్య, చిరు.. సాంగ్స్ లో ఎవరిది పైచేయి?

By:  Tupaki Desk   |   21 Dec 2022 2:30 AM GMT
బాలయ్య, చిరు.. సాంగ్స్ లో ఎవరిది పైచేయి?
X
నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి అలాగే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు కూడా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు చాలాసార్లు సంక్రాంతి బరిలో పోటీపడిన బాలయ్య మెగాస్టార్ ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకుంటూ వచ్చారు. కొన్నిసార్లు ఒకరు భారీ విజయాన్ని అందుకుంటే మరొకసారి మరొక హీరో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు.

మరికొన్నిసార్లు ఇద్దరు కూడా సక్సెస్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. సంక్రాంతి ఫెస్టివల్ అనేది మినిమం ఎంటర్టైన్మెంట్ సినిమాలకు మంచి కలెక్షన్స్ అందిస్తుంది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలకు కూడా అదే తరహా వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకున్నాయి.

అయితే ఏ సినిమా పాటలు ఎక్కువ స్థాయిలో యూట్యూబ్లో వ్యూవ్స్ అందుకుంటున్నాయి అనే వివరాల్లోకి వెళితే.. దాదాపు ఓకే తరహాలో ఇద్దరి పాటలు ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఎక్కువగా వాల్తేరు వీరయ్య పై చేయి సాధిస్తున్నాడు. ఇంతకు ముందు విడుదలైన జై బాలయ్య పాట కంటే మెగాస్టార్ బాస్ పార్టీ 24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అత్యధిక లైక్స్ అందుకుంది.

ఇక రీసెంట్ గా ఈ సినిమాల నుంచి సెకండ్ నెంబర్ సాంగ్స్ వచ్చాయి. నందమూరి బాలకృష్ణ సుగుణసుందరి అనే పాటతో రాగా మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి చిరంజీవి అంటూ రొమాంటిక్ పాటతో వచ్చారు. అయితే ముందుగా 24 గంటల్లో చిరంజీవి శ్రీదేవి సాంగ్ 6.16 మిలియన్ వ్యూవ్స్ అందుకోగా.. 24 గంటల్లో సుగుణసుందరి పాట 4.83 మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకుంది.

ఇక లైక్స్ పరంగా చూస్తే మెగాస్టార్ పాటకు 160.3k లైక్స్ రాగా బాలకృష్ణ పాటకు 155.2k లైక్స్ వచ్చాయి. చూస్తుంటే రెండు సినిమాలు కూడా పోటాపోటీగా జనాలకు చేరువవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక విధంగా ఇది థమన్ దేవిశ్రీప్రసాద్ మధ్య కూడా బలమైన పోటీ అని చెప్పవచ్చు. ఎక్కువగా దేవి శ్రీ ప్రసాద్ అయితే డామినేట్ చేస్తున్నాడు. మరి త్వరలోనే రెండు సినిమాల నుంచి మాస్ సాంగ్స్ రిలీజ్ చేయాలని రెడీ అవుతున్నారు. మరి అప్పుడు ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.