Begin typing your search above and press return to search.

బాలయ్య, చిరు.. ఇది తగ్గించేలా లేరు?

By:  Tupaki Desk   |   14 Jan 2023 2:30 AM GMT
బాలయ్య, చిరు.. ఇది తగ్గించేలా లేరు?
X
కమర్షియల్ సినిమా అనేసరికి హీరోలు కామన్ మెన్ గా ఉన్నా కూడా వంద మంది రౌడీలని కూడా సునాయాసంగా ఒంటి మీద ఎలాంటి దెబ్బ పడకుండా కొట్టేస్తూ ఉంటాడు. వందల మందిని హీరో కొడుతూ ఉంటే అభిమానులు థియేటర్స్ లో విజిల్స్ వేస్తూ ఉంటారు. సూపర్ పవర్స్ ఉన్న వారికి కూడా సాధ్యం కాని రీతిలో మన తెలుగు సినిమాలలో హీరోలు తమ హీరోయిజం చూపిస్తూ ఉంటారు.

ఇక తాజాగా సంక్రాంతి రేసులో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. దీనికి ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే కామన్ ఆడియన్స్ కి ఎవరేజ్ గా అనిపిస్తుంది. సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్ కి భాగా కనెక్ట్ అయినా కూడా కొన్ని సన్నివేశాలు శృతి మించి ఉన్నాయనే మాట వినిపిస్తుంది.

ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్, అలాగే బాలయ్యని ద్వేషించే వారు సినిమాలో ఉన్న అలాంటి అతి సన్నివేశాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓ యాక్షన్ ఎపిసోడ్ లో ఓ పెద్ద కారుని బాలకృష్ణ తన కాలితో తంతాడు. ఆ దెబ్బకి కారు ఒక్కసారిగా ఎగిరి వెనక్కి వెళ్తుంది. ఈ సీన్ ని ట్విట్టర్ లో పెట్టి మరో పల్నాటి బ్రహ్మనాయుడు, చెన్నకేశవ రెడ్డి సినిమాల తరహాలో ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని ట్రోల్ చేస్తున్నారు.

ఎక్కువగా యాంటీ ఫ్యాన్స్ ఈ సన్నివేశాన్ని ట్రోల్ చేస్తూ ఉండటం విశేషం. ఇక వాల్తేర్ వీరయ్య సినిమాలో సెకండ్ హాఫ్ లో కథనం ఎమోషనల్ గా ట్రావెల్ అవుతూ ఉన్న సమయంలో మధ్యలో సంబంధం లేకుండా హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ డ్యూయెట్ వస్తుంది. ఈ సాంగ్ ఎందుకు వచ్చిందో కూడా అర్ధం కావడం లేదంటూ మెగాస్టార్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆచార్య సినిమాలో చిరంజీవి యంగ్ లుక్ ని ట్విట్టర్ లో ఎంతగా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేసారో ఇప్పుడు వాల్తేర్ వీరయ్యలో ఆ సాంగ్ పైన కూడా అదే స్థాయిలో ట్రోల్ చేస్తూ ఉండటం గమనార్హం.

అయితే కమర్షియల్ సినిమా అన్న తర్వాత కొన్ని సందర్భాలలో దర్శకులు అవుట్ ఆఫ్ లైన్ వెళ్లి ఆలోచిస్తూ కొన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి ఎపిసోడ్స్ ఒక్కోసారి మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ రెండు సినిమాలలో కూడా దర్శకులు క్రియేట్ చేసిన ఆ ఎపిసోడ్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కారణం అవుతున్నాయి. కొన్ని సందర్భాలలో ఈ ట్రోల్స్ కూడా కమర్షియల్ సినిమాలకి ప్లస్ అయ్యి ఆడియన్స్ థియేటర్స్ కి రప్పించడంలో ఉపయోగపడతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.