Begin typing your search above and press return to search.

వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి.. ట్రైలర్స్ రెడీ!

By:  Tupaki Desk   |   30 Dec 2022 8:34 AM GMT
వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి.. ట్రైలర్స్ రెడీ!
X
2023 సంక్రాంతి ఫెస్టివల్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చాలా కీలకంగా కాబోతోంది. ఈ పండుగ సీజన్లో అగ్ర హీరోల సినిమాల ఒకే ప్రొడక్షన్ నుంచి వస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కూడా సంక్రాంతి ఫెస్టివల్ లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

ఇక రిలీజ్ డేట్స్ లో ఒకరోజు మాత్రమే తేడా ఉంది. ఇక దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొన్నట్లు అర్థమవుతుంది. అయితే ఎక్కువ స్థాయిలో మాత్రం వీరసింహారెడ్డి కాస్త పై చేయి సాధించే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం డిమాండ్ మేరకు బాలయ్య సినిమాకు చిరంజీవి సినిమా కంటే ఎక్కువ స్థాయిలో థియేటర్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ అయితే సినిమాలపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు అసలైన ట్రైలర్స్ విడుదల కావాల్సి ఉంది. వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబి అలాగే వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ ఇద్దరు కూడా ట్రైలర్స్ రెడీ చేసి ఉంచారు.

ఇక ముందుగా జనవరి 4న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక జనవరి 6వ తేదీన నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

రెండిటి మధ్యలో క్లాష్ రాకుండా నిర్మాతలు జాగ్రత్తలు అయితే బాగానే తీసుకుంటున్నారు. థియేటర్స్ లోకి మాత్రం వీరసింహారెడ్డి ముందుగా జనవరి 12వ తేదీన రాబోతోంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

యాదృచ్ఛికంగా ఈ రెండు సినిమాలలో కూడా శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా కనిపించడం మరొక విశేషం. మరి ఈ రెండు సినిమాలలో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.