Begin typing your search above and press return to search.

స్లో పాయిజ‌న్ లా మెల్ల మెల్ల‌గా ఎక్కేస్తోందే!

By:  Tupaki Desk   |   24 Nov 2022 5:30 PM GMT
స్లో పాయిజ‌న్ లా మెల్ల మెల్ల‌గా ఎక్కేస్తోందే!
X
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. ఈ మ‌ధ్య బాస్ న‌టించిన రెండు సినిమాలు ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌క‌పోవ‌డంతో మెగా ఫ్యాన్స్ అంతా `వాల్తేరు వీర‌య్య‌`నే న‌మ్ముకుంటున్నారు. ఎలాగైనా బాస్ ఈ మూవీతో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ కావాల‌ని.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకోవాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. చిరుకు వీరాభిమాని అయినా బాబి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డం కూడా చిరు ఫ్యాన్స్ హోప్ కి కార‌ణంగా మారింది.

మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీలో చిరుకు జోడీగా తొలి సారి శృతిహాస‌న్ న‌టిస్తోంది. చిరు- ర‌వితేజ క్రేజీ కాంబినేష‌న్ కార‌ణంగా ఈ మూవీపై ఇప్ప‌టికే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు చిరు గెట‌ప్‌ `ముఠాయేస్త్రీ`, `అంద‌రి వాడు` సినిమాల‌ని గుర్తు చేయ‌డంతో అభిమానుల ఆనందాన్ని హ‌ద్దే లేకుండా పోయింది, ఈ సారి బాస్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం ఖాయం అని సంబ‌రాలు చేసుకోవ‌డం మొద‌లు పెట్టారు.

సంక్రాంతి బ‌రిలో పోటా పోటీగా దిగనున్న ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ కు సంబందించిన ప్రోమోని రీసెంట్ గా విడుద‌ల చేశారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించ‌డ‌మే కాకుండా `బాస్ పార్టీ` అంటూ సాగే ఈ పాట‌కు సాహిత్యాన్ని అందించి పాట తొలి చ‌ర‌ణాల‌ని ఆల‌పించాడు. దీనికి సంబంధించిన ప్రోమో చూసిన వారంతా దేవి ఏంటీ ఇలా చేశాడంటూ పెద‌వి విరిచారు. ఇది కూడా `గాడ్ ఫాద‌ర్‌` సాంగ్ లా నీరుగార్చేలా వుందంటూ చిరు అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో దేవిపై విరుచుకుప‌డ్డారు.

అయితే బుధ‌వారం సాయంత్రం 4:05 నిమిషాల‌కు విడుద‌లైన లిరిక‌ల్ వీడియో చూసిన త‌రువాత అభిమానుల్లో క్ర‌మ క‌ర్ర‌మంగా ఈ పాట‌పై న‌మ్మ‌కం పెరుగుతూ రావ‌డం మొద‌లైంది. ప్రోమో చూసి తిట్టుకున్న వాళ్లే ఇప్ప‌డు క్ర‌మ క్ర‌మంగా బాస్ పార్టీపై ప్ర‌శంస‌లు కురిపించ‌డం మొద‌లు పెట్టారు. గంట‌ల వ్య‌వ‌ధిలోనే టెన్ మిలియ‌న్ వ్యూస్ ని అధిగ‌మించి రికార్డు స్థాయి వ్యూస్ దిశ‌గా బాస్ పార్టీ సాంగ్ దూసుకుపోతోంది.

దర్శ‌కుడు బాబి నేను ఓ అభిమానిగా అన్న‌య్య‌ని ఫ్యాన్స్ అంతా ఎలా చూడాల‌ని ఆశ ప‌డుతున్నారో అదే స్థాయిలో ఈ మూవీలో చూపిస్తున్నాన‌ని, త‌న‌ని న‌మ్మండ‌ని ప్రామిస్ చేశాడు.. అదే బాస్ పార్టీ సాంగ్ లో క‌నిపించిందని, అయితే బాస్ గ్రేస్ లో మ‌రింత ఊపు క‌నిపిస్తే ఆ జోష్ మ‌రోలా వుండేద‌ని మ‌రి కొంత మంది అంటున్నారు. ఓవ‌రాల్ గా బాస్ పార్టీ సాంగ్ స్లో పాయిజ‌న్ ల అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంద‌ని అర్థ‌మ‌వుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.