Begin typing your search above and press return to search.
వాల్తేరు వీరయ్య లెక్క.. అక్కడ బ్యాలెన్స్ ఉంది!
By: Tupaki Desk | 23 Jan 2023 2:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. 89 కోట్ల బ్రేక్ ఎవెన్ తో సంక్రాంతి రేసులోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు కొంత మేరకు కలెక్షన్స్ డ్రాప్ అయినా కూడా మరల మూడో రోజు నుంచి పుంజుకుంది. దీంతో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ ని అందుకుంది.
ఇక పండగ సీజన్ అయిన తర్వాత కూడా డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మొదటి వారం రోజులు టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కాస్తా తగ్గారు. అయితే వారం రోజుల తర్వాత టికెట్ రెట్లు సాధారణ స్థితికి రావడంతో వారు కూడా వాల్తేర్ వీరయ్య కోసం థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇక వీరసింహారెడ్డికి ఎవరేజ్ టాక్ రావడం కూడా వాల్తేర్ వీరయ్య సినిమాకి ప్రేక్షకులు పెరిగారని చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ కి వాల్తేర్ వీరయ్య సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దీంతో కలెక్షన్స్ దుమ్ము రేపాయి.
ఇదిలా ఉంటే ఏరియా వైజ్ గా వాల్తేర్ వీరయ్య సినిమా టాక్, వచ్చిన రెస్పాన్స్ చూసుకుంటే ఇలా ఉంది. నిజాం ఏరియాలో డిస్టిబ్యూటర్స్ కి భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఇక సీడెడ్ లో బ్రేక్ ఎవెన్ క్రాస్ చేసింది. యూఏలో కూడా బ్రేక్ ఎవెన్ అందుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో భారీ లాభాలు వచ్చాయి. పశ్చిమ గోదావరిలో మరో 80 లక్షలు వస్తే బ్రేక్ ఎవెన్ అందుకుంటుంది. అలాగే గుంటూరులో కూడా బ్రేక్ ఎవెన్ కి మరో 80 లక్షల దూరంలో ఉంది.
కృష్ణా జిల్లాలో భారీ లాభాలు అర్జించింది. నెల్లూరు, కర్ణాటక, ఓవర్సీస్ లో బ్రేక్ ఎవెన్ ని అందుకుంది. ఒక్క గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో తప్ప మిగిలిన అన్ని చోట్ల వాల్తేర్ వీరయ్య ప్రేక్షకులకె కాకుండా సినిమా థీయాట్రికల్ రైట్స్ కొనుక్కున్న డిస్టిబ్యూటర్స్ కి కూడా పూనకాలు తెప్పించే కలెక్షన్స్ ని అందించాయి. రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాలలోకి వచ్చాక మెగాస్టార్ చిరంజీవి చేసిన నాలుగు సినిమాలలో బయ్యర్లకి భాగా లాభాలు తెచ్చిన సినిమాగా వాల్తేర్ వీరయ్య నిలిచింది అని చెప్పాలి.