Begin typing your search above and press return to search.

పిలిస్తే ఆలోచిస్తానంటున్న మెగాస్టార్‌!

By:  Tupaki Desk   |   11 Jan 2023 3:30 PM GMT
పిలిస్తే ఆలోచిస్తానంటున్న మెగాస్టార్‌!
X
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన లేటెస్ట్ మూవీ `వాల్తేరు వీర‌య్య‌`. మ‌రి కొన్ని గంట‌ల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. అంతే కాకుండా ఈ మూవీ ప్రీమియ‌ర్ షోలు యుఎస్ లో గురువారం రాత్రి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో `వాల్తేరు వీర‌య్య‌` ప్ర‌మోష‌న్స్ పీక్స్ కి చేరుకుంది. రీసెంట్ గా ఈ మూవీ లాస్ట్ లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేసిన చిత్ర బృందం మిగ‌తా ప‌నుల్లో నిమ‌గ్నం అయ్యారు. రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

ఇదిలా వుంటే `వాల్తేరు వీర‌య్య‌` జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానున్న నేప‌థ్యంలో చిరంజీవి ప‌లు మీడియాల‌కు, కీల‌క యూట్యూబ్ ఛాన‌ల్ ల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. బుధ‌వారం ప‌లు మీడియా సంస్థ‌ల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన చిరు `వాల్తేరు వీర‌య్య‌`పై త‌న‌కున్న కాన్ఫిడెంట్ ని వెల్ల‌డించారు. అంతే కాకుండా ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌పై స్పందిచారు.

ఇదే సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బి కె` షోపై కూడా చిరు స్పందించారు. స‌ద‌రు యాంక‌ర్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స్పందించిన చిరు `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బి కె` షో బాగా వెలుతోంద‌ని వింటున్నాన‌ని చెప్పారు. అయితే ఆ షోకు మీరు వెళితే ఆ క‌ళే వేర‌ని స‌ద‌రు యాంక‌ర్ అన‌డంతో అది మీ అభిమాన‌మ‌ని తెలిపార. అయితే షోకు ఆహ్వానం వ‌స్తే ఎలా స్పందిస్తార‌ని అడిగితే పిలిస్తే ఆలోచిస్తానంటూ చిరు స‌మాధానం చెప్ప‌డం వైర‌ల్ గా మారింది.

ఇదిలా వుంటే ఇటీవ‌లే `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బి కె` సీజ‌న్ 2 స్టార్ట్ కావ‌డం.. అది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం తెలిసిందే. రీసెంట్ గా ప్ర‌భాస్‌, గోపీచంద్ లు షోలో సంద‌డి చేశారు. ఈ షోలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పాల్గొంటున్నారు. ఇటీవ‌లే ప‌వ‌న్ కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్త‌యిపోయింది. ప‌వ‌న్ సంద‌డి చేయ‌బోతున్నారు. అంతా మీరు రావాల‌ని కోరుకుంటున్నారు. వీరు షోలోకి ఎంట్రీ ఇస్తే ఆ క‌ళే వేరు అంటూ యాంక‌ర్ అన‌డంతో చిరు త‌నతైన స్టైల్లో పిలిస్తే ఆలోచిస్తాన‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.