Begin typing your search above and press return to search.
హిందీలో వీరయ్య బాక్సాఫీస్ సందడి ఉన్నట్లా? లేనట్లా?
By: Tupaki Desk | 5 Jan 2023 1:30 PM GMTమెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. జనవరి 13వ తారీకున తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమాను అదే టైటిల్ తో హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు హిందీలో ఈ సినిమాను డబ్ చేసినట్లుగా పేర్కొన్నారు. విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా ఇప్పటి వరకు హిందీ వర్షన్ యొక్క ట్రైలర్ కానీ.. టీజర్ కానీ.. పోస్టర్ కానీ బయటకు వదల్లేదు. టీజర్ లేకుండానే.. ట్రైలర్ హిందీ వర్షన్ విడుదల చేయకుండానే బాలీవుడ్ లో వాల్తేరు వీరయ్యను విడుదల చేస్తారా ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొందరు మాత్రం వాల్తేరు వీరయ్య ను తెలుగు రాష్ట్రాల్లో మరియు యూఎస్ లో విడుదల చేయడానికే మైత్రి మూవీ మేకర్స్ వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. థియేటర్ల సమస్య కారణంగా వాల్తేరు వీరయ్య తెలుగు రాష్ట్రాల రిలీజ్ విషయంలో ఆందోళన నెలకొంది. ఈ సమయంలో హిందీలో రిలీజ్ పై నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు అనేది సోషల్ మీడియా టాక్.
వాల్తేరు వీరయ్య సినిమా యొక్క హిందీ డబ్బింగ్ రైట్స్ ను అక్కడి వారికి ఇచ్చి ఉంటే రిలీజ్ విషయంలో మైత్రి వారికి ఇబ్బంది ఉండేది కాదు. కానీ మైత్రి వారు అక్కడ కూడా సొంతంగా విడుదల చేయాలి అని భావించారేమో అందుకే ఇప్పుడు రిలీజ్ కు కష్టంగా మారింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి గత చిత్రం గాడ్ ఫాదర్ కూడా హిందీలో విడుదల అయ్యింది. ఆ సినిమా ఇక్కడ పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా ఉత్తర భారతంలో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ ను దక్కించుకోలేదు.. అలాగే మినిమం వసూళ్లు రాబట్టలేక పోయింది.
మైత్రి వారి గత చిత్రం పుష్ప పెద్దగా ప్రమోషన్ లేకుండానే హిందీలో విడుదల అయ్యి ఏకంగా వంద కోట్లను వసూళ్లు చేసింది. అందుకే ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను అక్కడ ఆకట్టుకుంటే తప్పకుండా మంచి కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉంది.
సౌత్ సినిమాలకు అక్కడ ఆధరణ ఉంది. కనుక వాల్తేరు వీరయ్య ను అక్కడ విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ మైత్రి వారు మాత్రం తాజాగా వాల్తేరు వీరయ్య హిందీ వర్షన్ రిలీజ్ ఉందా? లేదా? అనే విషయమై క్లారిటీ ఇవ్వడం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.