Begin typing your search above and press return to search.
రంగంలోకి దిగిపోయిన 'వాల్తేర్ వీర్రాజు'
By: Tupaki Desk | 3 Dec 2021 9:36 AM GMTఈ మధ్య కాలంలో చిరంజీవి తన దూకుడు పెంచారనే విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఈ సారి ఆయన వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేశారు. కొరటాల దర్శకత్వంలో ఆయన 'ఆచార్య' సినిమాను చేశారు. చరణ్ నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమా, ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలా 'ఆచార్య' సినిమాతో కొత్త ఏడాదిలో తన సందడిని మొదలుపెట్టనున్న చిరంజీవి, ఆ తరువాత వరుస సినిమాలతో అదే ఊపును కొనసాగించనున్నారు.
అలా 'ఆచార్య'ను పూర్తి చేసేసి ఇలా 'గాడ్ ఫాదర్' సెట్స్ పైకి వచ్చేసిన చిరంజీవి, ఆ సినిమా షూటింగును చకచకా కానిచ్చేస్తున్నారు. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అలా ఒకటి రెండు షెడ్యూల్స్ షూటింగులో పాల్గొని, ఆ వెంటనే ఆయన 'భోళా శంకర్' ను కూడా సెట్స్ పైకి తీసుకుని వచ్చారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, గతంలో తమిళనాట భారీ వసూళ్లను కొల్లగొట్టిన 'వేదాళం' సినిమాకి రీమేక్. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు వేగాన్ని పెంచిన చిరంజీవి, ఈ రోజున బాబీ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వచ్చేశారు.
చిరంజీవి కథానాయకుడిగా బాబీ 'వాల్తేర్ వీర్రాజు' సినిమాను రూపొందిస్తున్నాడు. చిరంజీవికి ఏ రేంజ్ లో మాస్ ఇమేజ్ ఉందనేది అందరికీ తెలిసిందే. ఆ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని బాబీ ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ రోజున మొదలైంది. ఈ నెలంతా కూడా ఈ షెడ్యూల్ షూటింగు కొనసాగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంలో త్వరలో స్పష్టత రానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
'వాల్తేర్ వీర్రాజు' ఫస్టు షెడ్యూల్ పూర్తయిన తరువాత చిరంజీవి 'గాడ్ ఫాదర్'పై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్టు చెబుతున్నారు. 'ఆచార్య' .. 'గాడ్ ఫాదర్' .. 'వాల్తేర్' వీర్రాజు ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక 'భోళా శంకర్' సినిమా 2023 సంక్రాంతికి రానున్నట్టుగా చెబుతున్నారు. ఆ తరువాత చిరంజీవి దర్శకుల జాబితాలో మారుతి .. వెంకీ కుడుముల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరికొంతమంది యువ దర్శకులు కూడా చిరంజీవికి కథలను వినిపించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి స్పీడ్ చూస్తుంటే చేతిలో ఉన్న నాలుగు సినిమాలు ఒక గాడిలో పడేలోగానే, మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టేలా కనిపిస్తున్నారు.