Begin typing your search above and press return to search.
ఆ నలుగురికి వీరయ్య అలా ఝలక్
By: Tupaki Desk | 16 Jan 2023 4:56 AM GMTసంక్రాంతి పందెంలో బాస్ పార్టీని మాస్ ఆడియెన్ థియేటర్లకు వెళ్లి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి పందెంలో సిసలైన విన్నర్ మెగాస్టార్ అంటూ ఇప్పటికే మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉన్న వాటిలో బెటర్ వీరయ్యనే అన్న టాక్ కూడా వినిపించడంతో మెగాభిమానుల ఆనందానికి అవధుల్లేవ్!
ఇది చాలు బాస్ రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు అందుకోవడానికి అంటూ మెగాభిమానుల్లో ఒకటే కోలాహాలం కనిపిస్తోంది. మాస్ థియేటర్లలో కిటకిటను చూస్తుంటే ఈ సంక్రాంతి పుంజు రసవత్తరమైన విందును అందించిందనే మాట్లాడుకుంటున్నారు. పోటీ బరిలో ఎందరు ఉన్నా బాస్ ఈజ్ యూనిక్ ఎక్స్ క్లూజివ్ అంటూ సంబరాల్లో మునిగి తేలారు.
అదంతా సరే కానీ వాల్తేరు వీరయ్యగా మెగా బాస్ అరాచకానికి హద్దులు లేవు కానీ పూనకాలు తెప్పించేంతగా ఏదీ లేదని కూడా విమర్శకులు ఎత్తి చూపారు. ఇకపోతే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు పాపం వారి ఉనికిని చాటుకోవడానికేమీ లేదని కూడా తేల్చేశారు. అలాగే విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ రొటీన్ విలనీని ఎత్తి చూపారు. వీరయ్య అలా ఆ నలుగురికి ఝలక్ ఇచ్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
ప్రకాష్ రాజ్ డ్యూయల్ షేడ్ రోల్ రొటీన్ గా కనిపించగా.. హోటల్ లో రిలేషన్షిప్ మేనేజర్ పాత్రతో శ్రుతి హాసన్ ఎంట్రీ ఇవ్వడం తర్వాత RAW ఏజెంట్ అని తేలడం అదంతా తూతూగానే సాగుతుంది. ఈ పాత్రకు ఒరిగిపోయే పెద్ద సన్నివేశాలు పోరాట సన్నివేశాలు లేనే లేవు అన్న అసంతృప్తి ఉంది. ఏదో గ్లామరస్ గా పాటల కోసం అలా అడ్జస్ట్ చేశారని కూడా కామెంట్లు వినిపించాయి. టాలీవుడ్ కమర్షియల్ చిత్రాల్లో శ్రుతికి అంతగా ప్రాముఖ్యత లేని పాత్రగా మిగిలిపోయిందని విమర్శలొచ్చాయి.
రవితేజ భార్య పాత్రలో నటించిన మరో హీరోయిన్ కేథరిన్ ట్రెసా కూడా ఏదో ఒక ఏడుపు సన్నివేశానికే పరిమితమైంది. తనను దాచేశాం అని చెప్పి ఏదో చూపిస్తారులే అనుకుంటే.. తనకంటూ పెద్దగా డైలాగులు కానీ ఎమోషన్ సీన్లు కానీ ఏం లేవ్. ఒక గ్లామరస్ డాళ్ ని రొటీన్ గా ఉపయోగించుకున్నారన్న నిరాశ తప్పలేదు.
ఇక ప్రత్యేక గీతం బాస్ పార్టీ కి మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌతేలా ఓకే అనిపిస్తుంది. తను కేవలం పాటలో మాత్రమే కనిపిస్తుంది. కనీసం ముఠామేస్త్రీలో సిల్క్ స్మితకు ఉన్నంత సీన్ కూడా లేకుండా పోయింది. ఊర్వశి చాలా కాలంగా టాలీవుడ్ లో ఘనమైన ఆరంగేట్రం కోసం ఆశపడుతుంటే నిరాశే ఎదురైంది. ఓవరాల్ గా ఆ నలుగురు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే బాస్ ని మాత్రమే ఎలివేట్ చేయాలనే తపనలో బాబి వీళ్లను లో లెవల్లో చూపించాల్సి వచ్చిందని అంగీకరించాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.