Begin typing your search above and press return to search.
100 కోట్ల షేర్ తో వాల్తేర్ వీరయ్య రికార్డులు
By: Tupaki Desk | 21 Jan 2023 12:41 PM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేర్ వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మెగాస్టార్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల జాబితాలో వాల్తేర్ వీరయ్య చేరిందని చెప్పాలి. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వాల్తేర్ వీరయ్య సినిమా చూడడానికి థియేటర్లకు తరలించారు.
ఈ మూవీలో పూనకాలు లోడింగ్ అన్నట్లుగా మళ్ళీ మెగాస్టార్ మాస్ ర్యాంప్ లాగింగ్ అనే మాట వినిపించింది. ఒకప్పటి ఎనర్జీ లెవల్స్ మళ్ళీ చిరంజీవిలో వాల్తేర్ వీరయ్య సినిమాలో కనిపించందనే మాట వినిపించింది. యాంటీ ఫ్యాన్స్ కాస్తా ఈ సినిమాని ట్రోల్ చేసిన కూడా ఓవరాల్ గా కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ కాకుండా నిలకడగా నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ 175కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక ఓవరాల్ షేర్ పరంగా చూసుకుంటే వంద కోట్లని దాటేసింది. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కేటగిరీలోకి చేరిపోయింది.
ఈ సినిమాకి ఏకంగా 88 కోట్ల బిజినెస్ జరిగింది. ముందు వచ్చిన ఆచార్య డిజాస్టర్ కావడం. ఆ తరువాత వచ్చిన గాడ్ ఫాదర్ కూడా ఎవరేజ్ టాక్ తెచ్చుకోవడం వాల్తేర్ వీరయ్య బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగలేదు. అయితే కూడా 89 కోట్ల బ్రేక్ ఈవెన్ తో రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం ఎనిమిది రోజుల్లోనే 101.6 కోట్ల షేర్ ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో 83.71 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటకలో 11.05 కోట్లు రాబట్టింది.రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.40 కోట్లు రాబట్టింది.
ఓవరాల్ గా బ్రేక్ ఎవెన్ కలెక్షన్స్ దాటిపోవడంతో అదనంగా 12.16 కోట్లు లాభాలు వచ్చాయి. ఇకపై వచ్చేదంతా లాభాలుగానే ఉంటుంది. ఇవి కాకుండా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా సినిమాకి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తక్కువలో తక్కువగా వేసుకున్న 50 కోట్లకి పైగానే రైట్స్ రూపంలో వస్తాయి. ఎలా చూసుకున్న ఈ సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. రాజకీయాల నుంచి బయటకి వచ్చాక చిరంజీవి నుంచి ఈ స్థాయిలో లాభాలు తీసుకొచ్చే సినిమా అంటే వాల్తేర్ వీరయ్య అని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.