Begin typing your search above and press return to search.

వాల్తేర్ వీరయ్య కలెక్షన్స్…రౌడీ అల్లుడు కార్టూన్ వైరల్

By:  Tupaki Desk   |   18 Jan 2023 8:53 AM GMT
వాల్తేర్ వీరయ్య కలెక్షన్స్…రౌడీ అల్లుడు కార్టూన్ వైరల్
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ వాల్తేర్ వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించింది. మాస్ మహారాజ్ రవితేజ ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా నటించాడు. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో మల్టీస్టారర్ బ్రాండ్ తో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గత చిత్రాలతో పోల్చుకుంటే వాల్తేర్ వీరయ్య సినిమా చాలా అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది. మరల 20, 30 ఏళ్ల క్రితం చిరంజీవిలో ఉన్న ఎనర్జీ వాల్తేర్ వీరయ్య సినిమాలో కనిపించిందనే టాక్ వచ్చింది.

అయితే కొంతమంది పనిగట్టుకుని సినిమాపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. సినిమా డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. చిరంజీవిలో ఒకప్పటి ఈజ్ ఈ మూవీలో కనిపించలేదంటూ రాసుకొచ్చారు. అయితే విమర్శకుల నోళ్లు మూయించే విధంగా ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇప్పటికీ భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. చిరంజీవి కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించే దిశగా మూవీ దూసుకుపోతుంది.

ప్రేక్షకుల ఆదరణ కూడా బాగానే వస్తుంది. మొదటి నాలుగు రోజులు టిక్కెట్లు రేట్లు అధికంగా ఉండటంతో కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేకపోయారు. అయితే ఇప్పుడు రేటు తగ్గడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కు వాల్తేర్ వీరయ్య సినిమా చూడ్డానికి క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వాల్తేరు వీరయ్య సినిమాని ఒకప్పటి చిరంజీవి బ్లాక్ బస్టర్ రౌడీ అల్లుడు కలెక్షన్స్ తో పోల్చి చూపిస్తూ ఒక కార్టూన్ వైరల్ అయింది.

ఈ కార్టూన్ లో కామన్ ఆడియన్ ఒక వ్యక్తిని రౌడీ అల్లుడు సినిమా ఎలా ఉంది అని అడుగుతాడు. సినిమా యావరేజ్ అని అతను చెప్తాడు. రెండో వారంలో కలెక్షన్లు ఏంటి ఇలా వస్తున్నాయి. ఆరోజు యావరేజ్ అన్నావుగా అని అడుగుతాడు. ఒక వారం రోజులు ఏ సినిమాకైనా కలెక్షన్స్ ఉంటాయి అని ఇంకో వ్యక్తి చెప్తాడు. మూడో వారంలో సినిమాకి వస్తున్న ఈ షేర్ ఏంట్రా అని అడుగుతాడు. అదే నాకు అర్థం కావడం లేదు. అయినా నిలబడదు, నిలబడకూడదని ప్రార్థన చేశా అని చిరంజీవి వ్యతిరేకించే వ్యక్తి అంటాడు. నాలుగో వారంలో ఓరి నీ బాక్స్ బద్దలవ.

ఈ కలెక్షన్ ఏంట్రా అని అడుగుతాడు. అంతవరకు చిరంజీవిని తిట్టినవాడు బాబోయ్ నన్ను వదిలేయ్… నాకేమీ అర్థం కావడం లేదు. ఇది చిరంజీవి చిత్రం అని అంటాడు. ఈ కార్టూన్ ని వాల్తేరు వీరయ్య కి కూడా పోల్చి చూపిస్తూ మెగా ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.