Begin typing your search above and press return to search.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కలెక్షన్లన్నీ చోరీ!
By: Tupaki Desk | 17 Jan 2023 5:56 AM GMTసంక్రాంతి బరిలో ఇద్దరు అగ్ర హీరోల తెలుగు సినిమాలు పోటీ పడ్డాయి. పాజిటివ్ టాక్ తో రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ తెరకెక్కించింది. రెండూ మంచి హిట్ అందుకోవడంతో నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. రెండు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి. అటు నిర్మాతలు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ల ఓనర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత పెద్ద హీరోల సినిమాలు రావడం, సంక్రాంతి బరిలో నిల్చోవడంతో పాటు రెండూ సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే ఆ ఆనందం ఒక్కసారిగా పోయింది.
సంక్రాంతి పండగ కావడంతో బ్యాంకులకు సెలవు ఉంది. రెండు సినిమాలకు వచ్చిన కలెక్షన్లను థియేటర్ల నిర్వాహకులు తమ వద్దే ఉంచుకున్నారు. బ్యాంకులు తిరిగి తెరుచుకున్న తర్వాత బ్యాంకులో వేయవచ్చని థియేటర్లలోని లాకర్లలో డబ్బు ఉంచారు. అయితే ఇదే అదనుగా దొంగలు తమ ప్రతాపం చూపించారు.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ థియేటర్ లో దొంగలు పడి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల మూడు రోజుల కలెక్షన్లను దోచుకెళ్లారు. చోరీ విషయంపై వెంటనే థియేటర్ నిర్వాహకులు పొన్నూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకుని చోరీ ఎలా జరిగింది, ఎవరు చేసి ఉంటారు, థియేటర్ లో పని చేసే వారిలో ఎవరైనా దొంగలు ఉన్నారా, థియేటర్ సిబ్బంది సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చాయని సంబరపడే లోపే ఇలా జరగడంతో థియేటర్ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఈ సంక్రాంతి ఫుల్ ఖుషీతో సాగుతుందని ఆనందించే లోపే ఇలా జరగడంతో వారు బాధపడుతున్నారు.
ఇన్ని రోజులు సినిమాలు లేక, అడపాదడపా వచ్చిన సినిమాలు కూడా సరిగ్గా ఆడక సినిమా థియేటర్లు తమ కళ కోల్పోయాయి. పాత సినిమాలు రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అలాంటి సమయంలో సంక్రాంతి బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న రెండు సినిమాలు వాటి ద్వారా వచ్చిన మంచి వసూళ్లు థియేటర్ల నిర్వాహకులకు, డిస్ట్రిబ్యూటర్లపై కనక వర్షం కురిపించింది. ఇలాంటి ఆనంద సమయంలో ఇలా జరగడంతో వారు బాధపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.