Begin typing your search above and press return to search.
భలే హీరోయిన్.. మళ్లీ వస్తోంది
By: Tupaki Desk | 30 Dec 2015 9:30 AM GMTకొందరు హీరోయిన్లు ఫస్ట్ లుక్ లో అదోలా అనిపిస్తారు. కానీ సినిమాలో చూశాక అభిప్రాయం మారిపోతుంది. బాగానే ఇంప్రెస్ చేస్తారు. వామికా గబ్బి ఈ కోవకే చెందుతుంది. ఈ అమ్మాయిని ‘భలే మంచి రోజు’ పోస్టర్లలో.. ట్రైలర్లో.. ప్రమోషన్ కార్యక్రమాల్లో చూస్తే అదోలాగే అనిపించింది. అసలు హీరోయిన్ ఫీచర్లున్నాయా అన్న అనుమానం కలిగింది. కానీ సినిమాలో చూస్తే మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఆమె లుక్స్ - నటన జనాల్ని బాగానే ఆకర్షించాయి. ‘భలే మంచి రోజు’ సక్సెస్ కావడంతో తెలుగులో ఈ అమ్మాయికి మరిన్ని ఛాన్సులు దక్కే అవకాశాలున్నాయి. ఐతే తెలుగులో ఆమె చేయబోయే తర్వాతి సినిమాలేంటో గానీ.. ఓ తమిళ సినిమా ద్వారా ఆమె మళ్లీ మన ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.
‘భలే మంచి రోజు’ కంటే ముందు వామిక కమిటైన తమిళ సినిమా ‘మాలై నేరత్తు మైకం’ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పెద్ద కనెన్షనే ఉంది. దశాబ్దం కిందట మన ప్రేక్షకుల్ని సైతం కట్టి పడేసిన ‘7/జి బృందావన కాలనీ’కి ఇది సీక్వెల్. సెల్వ రాఘవన్ కథ అందించగా.. అతడి సతీమణి గీతాంజలి దర్శకత్వం వహించింది. తమిళంలో మాంచి క్రేజ్ మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ‘నన్ను వీడి నీవు పోలేవులే’ పేరుతో తెలుగులోకి కూడా అనువాదమైంది. కానీ ఒకేసారి రిలీజ్ చేయడం కుదర్లేదు. తమిళంలో మంచి టాక్ వస్తే.. కొన్నాళ్లు ఆగి తెలుగులో విడుదల చేస్తారట. ఎలాగూ వామిక తెలుగు ప్రేక్షకుల్ని ఇప్పటికే ఆకట్టుకుంది. సినిమా అక్కడ హిట్టయితే మంచి క్రేజ్ మధ్య రిలీజ్ చేయడానికి అవకాశమొచ్చింది. ‘భలే మంచి రోజు’తో హిట్టు కొట్టిన వామిక.. వారం వ్యవధిలో మరో హిట్టు ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.