Begin typing your search above and press return to search.
శిక్కుల అల్లర్ల వెబ్ సిరీస్ లో నటించిన ఈ బ్యూటీ ఎవరు?
By: Tupaki Desk | 24 July 2021 1:30 AM GMT``నాకు పెద్ద చిత్రం చేయడం.. పాపులరవ్వడం .. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. అది నా ధ్యేయం కాదు. మంచి జీవితం కావాలి. నాకు మంచి సమయం.. మంచి జ్ఞాపకాలు కావాలి. గొప్ప అనుభవాన్ని పొందాలనుకుంటున్నాను. హిందీలో నటించాలన్న కుతూహాలం ఇప్పుడే లేదు. ప్రాంతీయం అయినా స్వేచ్ఛగా ఉండాలి అంతే`` అంటోంది వామికా గబ్బి. శిక్కుల అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన సంచలనాల వెబ్ సిరీస్ గ్రహణ్ లో నటించిన ఈ బ్యూటీ తనదైన అందం నటనతో మైమరిపించింది. ఆ వెబ్ సిరీస్ విజయంలో తనో కీలక భాగం అని నిరూపించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ విజయవంతమైన సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
చాలామంది తమ కెరీర్ లో అగ్రస్థానంలో ఉంటారు. కానీ ఇప్పటికీ నిరాశకు లోనవుతారు. వెబ్ సిరీస్ గ్రహణ్ విజయవంతం కావడానికి వామికా గబ్బి ప్రదర్శన ఎంతో సహకరించింది. ఇక తానకు ఆఫర్లు వచ్చినా బాలీవుడ్ సినిమాలు చేయడానికి తాను తొందరపడటం లేదని ఈ బ్యూటీ అన్నారు
చిత్ర పరిశ్రమలో భాగం కావడం చాలా అనిశ్చితితో గమ్మత్తుగా ఉంటుంది. అందుకే ఇక్కడ జాగ్రత్తగా నడవాలని నమ్ముతాను అని అంది. వెబ్ సిరీస్ గ్రహణ్ విజయవంతం కావడానికి వివిధ ప్రాంతీయ చిత్ర పరిశ్రమలలో పనిచేసిన అనుభవం అక్కరకొచ్చిందని వామిక తెలిపారు. తాను ఇంకా బాలీవుడ్ సినిమాలు చేయడానికి తొందరపడటం లేదని అన్నారు.
నటిగా భాష పట్టింపు లేదు. మనం చేస్తున్న ప్రాజెక్టులు .. షూటింగ్ లో మీకు ఎలా అనిపిస్తుంది అన్నది ముఖ్యం. మీరు పెద్ద హిందీ చిత్రం చేస్తున్నప్పటికీ .. సెట్స్ లో షి ** అని భావిస్తే ప్రయోజనం ఏమిటి? నేను గొప్ప సన్నివేశం గొప్ప కాన్సెప్ట్ తో ప్రాంతీయ చలన చిత్రాన్ని ఎంచుకుంటాను. సెట్ లో మంచి సమయం ఉంటుంది. పెద్ద హిందీ చిత్రంలో ఉండటం కంటే నేను ఇదే బెటర్ అనుకుంటాను.. అని వామిక తెగేసి చెప్పారు.
జబ్ వి మెట్ (2007)- లవ్ ఆజ్ కల్ (2009)- మౌసం (2011) వంటి హిందీ చిత్రాలలో బిట్ రోల్స్ చేసిన 27 ఏళ్ల వామిక తనని వెంటాడుతున్నది మంచి పాత్ర అయితేనే నటిస్తుందట. బాలీవుడ్ లేదా ఎక్కడైనా. 1984 సిక్కుల అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ గ్రహణ్ తో వామిక గబ్బికి గొప్ప పేరొచ్చింది. మునుముందు తాను హిందీ పరిశ్రమకు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. వామిక సోషల్ మీడియాల్లోనూ చాలా స్పీడ్ గా ఉంది. ఇన్ స్టాలో తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంతర్జాలంలో దుమారం రేపుతోంది. పంజాబీ బొద్దందం జోరుగా వైరల్ అయిపోతోంది.