Begin typing your search above and press return to search.
టాలీవుడ్ ని వదిలి పోనంటోంది
By: Tupaki Desk | 31 Dec 2015 1:04 PM GMTక్రిస్మస్ కి రిలీజ్ అయిన మూవీస్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న భలే మంచి రోజుతో మరో సక్సెస్ సాధించిన సుధీర్ బాబు.. హీరోయిన్ వామికకు కూడా క్రేజ్ తెచ్చిపెట్టాడు. ప్రస్తుతం సౌత్ లో సినిమాలు చేస్తున్నా.. ఈమె ఓ పంజాబీ. ఆ భాషతోనే సినీ అరంగేట్రం చేసిన ఈ భామ.. తర్వాత హిందీలో సిక్స్ టీన్, తమిళ్ లో మాలై నేరత్తు మయకం అనే చిత్రాలలో నటించింది. ఈమూవీ చేస్తున్నపుడే.. టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని, తన పాత్ర నచ్చడంతో వెంటనే వాలిపోయానని అంటోంది వామిక.
కొత్త డైరెక్టర్ అయినా శ్రీరామ్ ఆదిత్య మూవీ తీసిన విధానం సూపర్బ్ అని.. షూటింగ్ లో ఉండగానే.. భలే మంచి రోజు సూపర్ హిట్ అవుతుందనే విషయం అర్ధమయిందని చెబుతోంది. టాలీవుడ్ లో తొలి చిత్రమే ఇంత పెద్ద సక్సెస్ కావడంతో చాలా ఆనందంగా ఉందిట. సక్సెస్ టూర్ లో భాగంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లినపుడు.. ఫ్యాన్స్ నుంచి వచ్చిన స్పందనకు ఉబ్బి తబ్బిబ్బయ్యానని అంటోంది. అయితే.. అందరు కొత్త యాక్టర్స్ మాదిరిగానే మొదట్లో చాలా కంగారు పడిందట ఈ చిన్నది కూడా. అయితే.. అది యాక్టింగ్ విషయంలో కాదని, సౌత్ విషయానికి వచ్చేసరికి భాషతో సమస్య వచ్చిందని అంటోంది. తమిళ్ చిత్రం చేసేటపుడు.. భాష అర్ధం కాక ఏడ్చేసిందట కూడా. అయితే.. ఆ సమయంలో తండ్రి ఓదార్చి, నచ్చచెప్పారట. అలా తనపై తాను నమ్మకం పెంచుకున్నానని అంటోంది.
ఇక రాబోయే సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికి 'నన్ను వదిలి నీవు పోలేవులే' అనే చిత్రంలో మాత్రమే నటిస్తుండగా.. అది రిలీజ్ కు కూడా సిద్ధమయిపోయింది. ఇది రిలీజ్ అయ్యాకే.. మరుసటి ప్రాజెక్టుల సంగతి ఆలోచిస్తానంటోంది వామిక. అది కూడా హిట్ అయితే మాత్రం.. టాలీవుడ్ లో సెటిల్ అయ్యేందుకు గట్టిగా ట్రై చేస్తుందట.