Begin typing your search above and press return to search.

`స‌లార్` విల‌న్ వైఫ్ పాత్ర‌లో వార్ బ్యూటీ

By:  Tupaki Desk   |   8 July 2021 1:30 PM GMT
`స‌లార్` విల‌న్ వైఫ్ పాత్ర‌లో వార్ బ్యూటీ
X
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా `కేజీఎఫ్` ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ `స‌లార్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ కూడా జ‌రిగింది. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర స‌మాచారం లీక‌వుతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ కి విల‌న్ గా ఓ ప్ర‌ముఖ న‌టుడిని లాక్ చేశార‌ని ప్ర‌చార‌మైంది. అత‌డు ఎవ‌రు? అన్న‌ది ఇంకా సస్పెన్స్ గా ఉంది. కోలీవుడ్ లేదా బాలీవుడ్ న‌టుడిని దిగుమ‌తి చేయాల‌ని ప్ర‌శాంత్ సీరియ‌స్ గా వెదుతుకున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఆ పాత్ర‌కు క‌థ‌లో చాలా ప్రాముఖ్య‌త కూడా ఉండ‌బోతుంది.

ఇందులో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌కు కుటుంబ నేప‌థ్యం...ఓ గొప్ప‌ చ‌రిత్ర కూడా ఉంటుందిట‌. అత‌ని ప్లాష్ బ్యాక్ స‌న్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయ‌ని టాక్ వినిపిస్తోంది. అది పాజిటివ్ యాంగిలా...నెగిటివ్ యాంగిలా? అన్న‌ది ప‌క్క‌నే బెడితే ఆ పాత్రధారుడి వైఫ్ పాత్ర కూడా క‌థ‌లో అంతే కీల‌కంగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. కీల‌క‌మైన విల‌న్ వైఫ్ పాత్ర కోసం వార్ బ్యూటీ వాణీ క‌పూర్ ని ఫైన‌ల్ చేసిన‌ట్లు తాజా స‌మాచారం. వాణీ క‌పూర్ ప్లాష్ బ్యాక్ లో వ‌చ్చే స‌న్నివేశాల్లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు.

మొత్తానికి వాణీ క‌పూర్ సౌత్ కెరీర్ లో కీల‌క పాత్ర‌లో అవ‌కాశం అందుకుంది. బాలీవుడ్ లో న‌టిగా కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ..స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌నిచేసిన‌ప్ప‌ట‌కీ ఆమె కెరీర్ టేకాఫ్ అవ్వ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. శుధ్ దేశీ రొమాన్స్ త‌ర్వాత వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ కెరీర్ కి ద‌క్కాకే రేంజు మారింది. తాజాగా స‌లార్ ఛాన్స్ తో వాణీ కెరీర్ ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి. ప్ర‌స్తుతం వాణీ క‌పూర్ హిందీలో న‌టించిన‌ మూడు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.