Begin typing your search above and press return to search.
కంగన వర్సెస్ దిల్జీత్.. ఇంకా గొడవ ముదురుతోంది!
By: Tupaki Desk | 12 Dec 2020 4:30 AM GMTకంగన రనౌత్ వర్సెస్ దిల్జీత్ దోసాంజి వివాదం అంతకంతకు ముదిరిపాకాన పడుతోందే కానీ ఎండ్ అన్నదే లేదు. కేంద్రానికి వ్యతిరేకంగా పంజాబీ రైతుల నిరసనల నేపథ్యంలో కంగన కామెంట్లను వ్యతిరేకిస్తూ దిల్జీత్ తనపై వరుస ట్వీట్లు చేశారు. దీంతో ఆ ఇద్దరి మధ్యా గొడవ ముదిరిపాకాన పడింది. ఇప్పటికీ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ వ్యక్తిగతంగా రుబాబ్ కి పాల్పడడం అభిమానుల్లో చర్చకు వచ్చింది.
తాజా ట్వీట్ లో కంగన మరోసారి దిల్జీత్ పై పంచ్ వేసింది. `దిల్జిత్ కిట్టే ఆ` అని కంగనా ట్వీట్ చేయడంతో దానికి దిల్జిత్ నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. ఈ వార్ డిసెంబర్ 03 న ట్విట్టర్ లో మొదలైంది. నాటి నుంచి నిరంతరాయంగా ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోంది. కంగనా రనౌత్ - దిల్జిత్ దోసాంజ్ ట్విట్టర్ వాగ్వాదంపై వైరల్ ట్వీట్ల.. వరుస నివేదికలు ఒక రకంగా చాలా మందికి వినోదం పంచుతున్నాయి. అంతా మర్చిపోతున్నారు అనుకుంటుండగానే మళ్లీ ఏదో ఒక గడబిడ. ట్వీట్ యుద్ధం హీట్ పెంచుతోంది.
మునుపటి వాగ్వాదంలోకే మళ్లీ దిల్జీత్ ని లాగింది కంగన. మరోసారి దిల్జీత్ ను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో పంజాబీ అర్థం కావడం లేదు అర్థమయ్యే భాషలో గూగుల్ చేయండి అంటూ దిల్జీత్ ని అడిగింది కంగన.
అనంతరం ధారావాహికలా బోలెడన్ని విషయాల్ని అతడికి చేరవేసింది.
“రైతుల నిరసనలు.. ఇస్లాం అనుకూల.. భారత వ్యతిరేక చిత్ర పరిశ్రమకు చెందిన బ్రాండ్లు అన్నీ వరదలో కొట్టుకుపోతాయి” అంటూ దిల్జీత్ - ప్రియాంక చోప్రాలను ఉద్ధేశించి కంగన వ్యాఖ్యానించింది.
వెంటనే దానికి కౌంటర్ గా దిల్జీత్ దోసాంజి తన ఇన్ స్టాలో “LOL” GIF తో “ఆఫ్టర్ ఎఫెక్ట్స్” అనే పదాలను ఉపయోగించారు. అయితే ఆ గొడవ అక్కడితో ముగిసిపోలేదు. `దిల్జిత్ కిట్టే ఆ` అనే హ్యాష్ ట్యాగ్ తో దిల్జిత్‌ను ఉద్దేశించి కంగనా తన తాజా ట్వీట్ లో పసుపు రంగు చీరలో అతడి మూడు ఫోటోలను పోస్ట్ చేసింది. “ఈ రోజు హైదరాబాద్ లో 12 గంటల షిఫ్ట్ లో పనిచేసిన తరువాత సాయంత్రం నేను ఓ ఈవెంట్ లో హాజరు కావడానికి చెన్నైకి వెళ్లాను. అది ఒక ఛారిటీ ఈవెంట్. నేను పసుపు రంగులో ఎలా కనిపిస్తాను? అలాగే # దిల్జీత్ కిట్టే ఆ? అందరూ ఇక్కడ ట్విట్టర్ లో అతని కోసం వెతుకుతున్నారు” అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యానం చేసింది కంగన.