Begin typing your search above and press return to search.

చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య మాటల యుద్ధం.. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   3 April 2022 7:31 AM GMT
చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య మాటల యుద్ధం.. ఎందుకో తెలుసా?
X
స్టార్‌ హీరో సినిమా వస్తుందంటే చాలు అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. థియేటర్ల వద్ద వారు చేసే సందడి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అదే ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తే... ఇంక ఆ కిక్కే వేరు.

దీనికి తోడు ఆ సినిమాను కెరీర్‌లోనే అపజయం ఎరుగని దర్శకుడు తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చ రణ్‌ కథానాయకులుగా.. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా 'రౌద్రం రణం రుధిరం-ఆర్‌ఆర్‌ఆర్‌' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హీరో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా , జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించారు ఈ సినిమాలో. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కన్నడ, మలయాళ, తమిళ, హిందీ, తెలుగు భాషల్లో రూపొందించిన ఈ చిత్రం దేశీయంగానే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లోనూ ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ పీరియాడికప్ ఎపిక్ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు జీవించేశారు. వీరు నటించిన తీరును చూసి ప్రేక్షకులు తెగ సంబర పడిపోతున్నారు. విమర్శకులు కూడా వీరిద్దరి నటనను పొగుతున్నారు.

యాక్షన్ సిన్నివేషాల్లోనే కాకుండా డ్యాన్స్, ఎమమోషన్స్ పండించడం ఇద్దరూ సరి సమానంగా ఉన్నారు. ఎవరూ తగ్గకుండా అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమా ఈ ఇద్దరు హీరోల కెరియర్ లోనూ బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాపై అభిమానుల గొడవ ప్రారంభం అయింది. ఓ వైపు రామ్ చరణ్ అభిమానులు, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు మా హీరోకే రావాలంటే మా హీరోకే రావాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే చాలా మంది ఈ ఇద్దరు హీరోలకు బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని కోరుకుంటున్నారు.

అయితే అసలు ఈ సినిమా జాతీయ అవార్డును అందుకుంటుందో లేదో తెలియాలన్నా... జూనియర్ ఎన్టీఆర్ లేదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకుంటారో లేదో తెలియాలంటే మనం ఇంకా కొన్ని నెలలు వేచి చూడాల్సిందే. అయితే వీరిద్దరిలో జాతీయ బెస్ట్ యాక్టర్ అవార్డు, ఆర్ఆర్ఆర్ సినిమాకు జాతీయ అవార్డు రావాలని మనం కూడా కోరుకుందాం. దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన ఎన్నో సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకొని తెలుగు సినిమా స్థాయిని ఓ మెట్టు ఎక్కించాయి.