Begin typing your search above and press return to search.

వరంగల్ శ్రీను.. 100 కోట్ల దెబ్బ!

By:  Tupaki Desk   |   26 Nov 2022 3:30 AM GMT
వరంగల్ శ్రీను.. 100 కోట్ల దెబ్బ!
X
సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేవారు దాదాపు పేకాట ఆడుతున్నట్లే అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ అయితే చాలా రిస్క్ చేసి మరి బిజినెస్ చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో రిలీజ్ అయ్యే వరకు కూడా తెలియడం లేదు. కొంతవరకు నిర్మాతలు అయితే కనీసం నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా అయినా సేఫ్ అవుతారు.

కానీ సినిమాను కొనుగోలు చేసి విడుదల చేసే డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కొన్నిసార్లు దారుణంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం నైజాం డిస్ట్రిబ్యూటర్ గా బాగా వైరల్ అయిన వరంగల్ శ్రీను మాత్రం దారుణంగా నష్టపోయాడు.

అతను ఈ యొక్క ఏడాదిలోనే దాదాపు 100 కోట్ల వరకు నష్టాలను చూడాల్సి వచ్చింది. గతంలో క్రాక్ సినిమా హక్కులను వరంగల్ శ్రీను సొంతం చేసుకుని మంచి లాభాలను అందుకున్నాడు.

అయితే అతను ఇటీవల కాలంలో మాత్రం విడుదల చేసిన కొన్ని సినిమాలు దారుణంగా నష్టాలను కలిగించాయి. ముఖ్యంగా లైగర్ సౌత్ ఇండియా లాంగ్వేజెస్ ను అతను కొనుగోలు చేయగా దాదాపు 51 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఇక ఆచార్య సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేయగా అక్కడ 25 కోట్ల వరకు నష్టాలు చూడాల్సి వచ్చింది. ఇక ఆడవాళ్లు మీకు జోహార్లు ఏపీ తెలంగాణ లో అతనికి ఎనిమిది కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.

విరాటపర్వం 8.5 కోట్లు, సామాన్యుడు మరో నాలుగు కోట్లు వరకు నష్టాలు కలిగించింది. కేవలం ఒక డబ్బింగ్ సినిమా విక్రాంత్ రోణా మాత్రమే అతనికి పెట్టిన పెట్టుబడికి కొంత ప్రాఫిట్ అయితే అందించింది.

కానీ మిగతా సినిమాల వలన దాదాపు 100 కోట్లకు పైగా నష్టాలను చూడాల్సి వచ్చింది. నైజంలో దిల్ రాజుకు వ్యతిరేకంగా కూడా వరంగల్ శ్రీను ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక 2022లో మాత్రం అతను వరుస నష్టాలను చూడాల్సి వచ్చింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.