Begin typing your search above and press return to search.
స్టార్ ప్రొడ్యూసర్ కు షాకిస్తున్న వరంగల్ శ్రీను
By: Tupaki Desk | 25 April 2022 11:30 AM GMTగత కొంత ఆకలంగా నైజాం లో ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఈ ఏరియాలో స్టార్స్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అత్యధికంగా వినిపించే పేరు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. కానీ గత కొంత కాలంగా ఈ ఏరియాలో కొత్త పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అదే వరంగల్ శ్రీను. చిన్న చిత్రాల డిస్ట్రిబ్యూటర్‌గా ఈ రంగంలోకి అడుగుపెట్టిన వరంగల్ శ్రీను ఇప్పడు ఏకంగా భారీ చిత్రాలనే డిస్ట్రిబ్యూట్ చేసే స్థాయికి వచ్చేశారు. మాస్ మహారాజా రవితేజ 'క్రాక్' బ్లాక్ బస్టర్ హిట్ తో నైజాం లో హాట్ టాపిక్ గా మారిన వరంగల్ శ్రీను ప్రస్తుతం 'ఆచార్య'తో మరోసారి వార్తల్లో నిలిచారు.
అల్లరి నరేష్ నాంది, నితిన్ 'చెక్', విశాల్ 'చక్ర', కార్తీ 'సుల్తాన్' వంటి చిత్రాలని నైజామ్ లో డిస్ట్రిబ్యూట్ చేసి డిస్ట్రిబ్యూటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. గత కొంత కాలంగా స్టార్ ప్రొడ్యూసర్, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తో పోటీపడుతున్నారు. ఇప్పడు ఏకండా దిల్ రాజు తో పోటీపడి మెగాస్టార్ చిరంజీవి నటించిన క్రేజీ మూవీ 'ఆచార్య' నైజాం హక్కుల్ని ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకోవడం ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి కలిసి నటించిన సినిమా కావడం.. చిరు నుంచి రెండేళ్ల విరామం తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల్లోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లోనూ ఈ మూవీ బిజినెస్ పరంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో నైజాం డిస్ట్రిబ్యూషన్ కోసం దిల్ రాజు - వరంగల్ శ్రీను మధ్య రసవత్తర పోటీ నడిచిందట. అయితే చివరికి ఈ పోటీలో వరంగల్ శ్రీను అత్యధిక మొత్తం చెల్లించి 'ఆచార్య' నైజాం హక్కుల్నిదక్కించుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ మూవీ నైజాం హక్కుల కోసం వరంగల్ శ్రీను ఏకంగా 42 కోట్లు చెల్లించారట. ఇంత పెద్ద మొత్తం చెల్లించి ఈ మూవీ నైజాం ఏరియా ప్రదర్శన హక్కుల్ని వరంగల్ శ్రీను దక్కించుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారితీసింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీని ఏప్రిల్ 29న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచా కార్యక్రమాల జోరు పెంచేశారు. ఇటీవల రామ్ చరణ్ నటించిన 'ట్రిపుల్ ఆర్' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో 'ఆచార్య'పై క్రేజ్ పెరిగింది.
ఆ కారణంగానే 'ఆచార్య' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 133 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేపినట్టుగా చెబుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే రూ.109 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఒక్క నైజామ్ ఏరియా హక్కులకే వరంగల్ శ్రీను 42 కోట్లు చెల్లించడం విశేషంగా చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు ఈ మూవీకి నార్త్ లోనూ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ లభించడం ఖాయమని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాలు కూడా ఇదే చెబుతున్నారు. ఏం జరగనుందో 'ఆచార్య' ఎలాంటి ఫలితాన్ని అందించనుందో తెలియాలంటే ఏప్రిల్ 29 వరకు వేచి చూడాల్సిందే.