Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో రీమేక్ ల‌కు డేంజ‌ర్ బెల్స్‌!

By:  Tupaki Desk   |   1 Nov 2022 2:30 AM GMT
టాలీవుడ్ లో రీమేక్ ల‌కు డేంజ‌ర్ బెల్స్‌!
X
రీమేక్ సినిమాల‌కు టాలీవుడ్ లో డేంజ‌ర్ బెల్స్ మొగుతున్నాయా?.. ప్రేక్ష‌కులు కూడా రీమేక్ లంటే విసిగిపోతున్నారా?.. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఒక‌ప్పుడు ఇత‌ర భాష‌ల్లో సూప‌ర్ హిట్ లుగా నిలిచిన సినిమాల‌ని తెలుగులో రీమేక్ చేస్తే జ‌నం ఎగ‌బ‌డి చేసే వారు. కానీ ప్ర‌స్తుతం అలా జ‌ర‌గ‌డం లేదు. మార్పులు చేర్పులు చేసి తీసినా ప్రేక్ష‌కుల‌కు రుచించ‌డం లేదు. బిగ్ స్టార్స్ న‌టించిన రీమేక్ ల‌ని కూడా ప్రేక్ష‌కులు సున్నితంగా తిర‌స్క‌రిస్తున్నారు.

ఓరిజిన‌ల్ సినిమాల‌కు ఇచ్చే ప్రియారిటీని రీమేక్ ల‌కు ఇవ్వ‌డం లేదు. స్టార్ సినిమా, క్రేజీ కాంబినేష‌న్ వున్నా స‌రే రీమేక్ లంటేనే ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపించ‌డం లేదు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల విడేద‌లైన సినిమాలు నిరూపించాయి. స్టార్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత `వ‌కీల్ సాబ్‌` అంటూ రీమేక్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఇది ఫ‌ర‌వాలేద‌నిపించింది. ఆ త‌రువాత మ‌రో రీమేక్ మూవీ `భీమ్లా నాయ‌క్‌`తో అల‌రించాల‌నుకున్నాడు.

టాక్ పాజిటివ్ గా వున్నా సినిమా మోస్త‌రు వ‌సూళ్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చిందంటే రీమేక్ సినిమాలో స్టార్ హీరో వున్నా స‌రే ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. రీసెంట్ గా విడుద‌లైన మెగాస్టార్ మూవీ `గాడ్ ఫాద‌ర్‌` కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార తొలిసారి క‌లిసి న‌టించిన ఈ మూవీ ద‌స‌రా సీజ‌న్ కు బ‌రిలో నిలిచి ఆశించిన స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక చేతులెత్తేసింది.

ఇంత మంది స్టార్స్ వున్నా కూడా ఆశించిన స్థాయి మెరుపులు సినిమాలో లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు ఈ సినిమాని ఆశించిన స్థాయిలో ఆద‌రించ‌లేక‌పోయారు. ముందు రోజు హ‌డావిడి చేసినా.. క్ర‌మ క్ర‌మంగా దీని హంగామా బాక్సాఫీస్ వ‌ద్ద త‌గ్గిపోయింది. అదే స‌మ‌యంలో `కాంతార‌` రావ‌డంతో ఈ సినిమాని ప్రేక్ష‌కులు పూర్తిగా మ‌ర్చిపోయారు. చిరు సినిమాకు ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి ప‌రిస్థితి ఏ సినిమాకు త‌లెత్త‌క‌పోవ‌డంతో రీమేక్ ల జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఇక ఇదే త‌ర‌హాలో త‌మిళంలో హిట్ అనిపించుకున్న‌ `ఓ మై క‌డ‌వులే` ఆధారంగా `ఓరి దేవుడా` మూవీని రీమేక్ చేశారు. విక్ట‌రీ వెంక‌టేష్ దేవుడిగా గెస్ట్ క్యారెక్ట‌ర్ లో న‌టించ‌గా, విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా.. ముందు రోజు మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టినా `కాంతార‌` త‌రువాత దీని గురించి ప‌ట్టించుకున్న ప్రేక్ష‌కుడే లేడంటే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు.

అంతే కాకుండా ఈ సినిమాకు తోడుగా కార్తి న‌టించిన `స‌ర్దార్‌` కూడా మంచి టాక్ ని ద‌క్కించుకోవ‌డంతే తెలుగులో రీమేక్ అయిన సినిమాల‌ని ప‌క్క‌న పెట్టి ప్రేక్ష‌కులు డ‌బ్బింగ్ సినిమాల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం మొద‌లు పెట్టారు. ఇక ఒటీటీ ప్లాట్ ఫాంల కార‌ణంగా ప్ర‌తీ భాష‌కు చెందిన సినిమా ప్రేక్ష‌కుల‌కు తెలిసిపోతోంది. దీంతో రీమేక్ ల‌ని ప్రేక్ష‌కులు మ‌ళ్లీ చూడాల‌నుకోవడం లేదు. ఈ నేప‌థ్యంలో రీమేక్ ల‌కు ఫుల్ స్టాప్ పెడితేనే బెట‌ర్ అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.