Begin typing your search above and press return to search.

వీడియో: బాలయ్య బాబు ఎయిర్ పోర్ట్ లో..

By:  Tupaki Desk   |   24 Aug 2019 12:42 PM IST
వీడియో: బాలయ్య బాబు ఎయిర్ పోర్ట్ లో..
X
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో #NBK105 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. వ్యాన్ డైక్ స్టైల్ గడ్డంలో బాలయ్య లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఎక్కువమందికి మాత్రం ఈ గెటప్ రాబర్ట్ డౌనీ జూనియర్ పోషించే టోనీ స్టార్క్ లుక్ ను గుర్తు తెస్తోంది. ఏదేమైనా బాలయ్య కొత్త లుక్ మాత్రం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్యకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో బాలయ్య వైట్ కలర్ స్టైలిష్ బ్లేజర్ ధరించి ఎయిర్ పోర్ట్ లో నడుస్తూ రావడం.. తన సూట్ కేసును దూరంగా జరపడం.. మళ్ళీ దానికి ఒక మ్యాజిక్ లాగా ఒక దారం సహాయంతో దగ్గరకు లాక్కోవడం.. మరోసారి అదే పని రిపీట్ చేయడం కనిపిస్తోంది. ఈ తతంగం అంతా చూస్తుంటే #NBK105 షూటింగ్ లో భాగంగా ఈ సీన్ చిత్రీకరణ జరిగిందని అర్థం అవుతోంది.

దీనిపై నెటిజన్లు తలోరకమైన కామెంట్లు చేస్తున్నారు. ఒకరేమో ఇది సినిమాలో ఒక కామెడీ సీన్ అయి ఉండొచ్చని అభిప్రాయపడితే మరొకరు బాలయ్య బాబు ఎవరినో ఆటపట్టిస్తున్నారని.. ఇదో ప్రాంక్ సీన్ కావొచ్చని అన్నారు. ఏదేమైనా బాలయ్య ఈ గెటప్ లో యమా స్టైలిష్ గా ఉన్నారు. మరి ఈ వీడియో ఏంటో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకూ వేచి చూడాలి. ఆలస్యం ఎందుకు. వీడియో పై ఒక లుక్కేయండి.