Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ని చూసి చరణ్ షాక్ అయ్యారా?
By: Tupaki Desk | 16 March 2022 5:46 AM GMTప్రతీ ఇండస్ట్రీలోనూ హీరోల మధ్య, హీరోల ఫ్యాన్స్ మధ్య పోటీ వుండటం సహజం. ఆ మాత్రం పోటీ లేకపోతే మజా వుండదు. పోటా పోటీగా రసవత్తరమైన సినిమాలు రావు. బాక్సాఫీస్ వద్ద సందడే వుండదు. కానీ టాలీవుడ్ హీరోలు అందుకు భిన్నంగా అడుగులు వేస్తూ అభిమానుల మధ్య వున్న అంతరాల్ని చెరిపేస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అది కొన్ని సందర్భాల్లో సత్ఫలితాల్సి అందిస్తున్నా మరి కొన్ని సార్లు ఫ్యాన్స్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తోంది కూడా. ఇదిలా వుంటే ఈ ఏడాది 'ఆర్ ఆర్ ఆర్'తో ఓ అద్భుతానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలవబోతోంది.
స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్స చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం గత కొంత కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న భారీ స్థాయిలో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం అప్పుడే ప్రచార కార్యక్రమాల్ని స్టార్ట్ చేసేసింది. ఈ నెల 14 నుంచే 'ఎత్తర జెండా.. 'అంటూ సాగే సెలబ్రేషన్స్ సాంగ్ లిరికల్ వీడియోతో ప్రచార పర్వాన్ని ప్రారంభించేసింది. ఈ సందర్భంగా హీరోలు, దర్శకుడు వరుసగా మీడియాతో ఇంటరాక్ట్ కావడం మొదలుపెట్టారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో మెగా పవర్ స్టార్ గురించి అన్న మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
వివరాల్లోకి వెళితే... పబ్లిక్ గా ఏ స్టార్ హీరో తనని తాను పొగుడుకున్న సందర్భాలు మన టాలీవుడ్ లో చాలా తక్కువ. అయితే ఎన్టీఆర్ మాత్రం ఎన్నడూ లేని విధంగా తన గురించి, తన నటన గురించి గొప్పగా చెప్పుకోవడం విశేషం. 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ నేపథ్యంలో పలు మీడియాలతో ముచ్చటిస్తున్న ఎన్టీఆర్ రామ్ చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఆకట్టుకుంటోంది. 'ఆర్ ఆర్ ఆర్' చిత్రీకరణ సమయంలో తన నటన, యాక్టింగ్ స్కిల్స్ చూసి రామ్ చరణ్ సర్ ప్రైజ్ అయ్యాడని షాకింగ్ విషయాల్ని చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా రామ్ చరణ్ గుడ్ హ్యుమన్ బీయింగ్ అని, అలాంటి స్నేహితుడిని కలిగి వుండటం నా అదృష్టం అని స్పష్టం చేశారు. ఈ మాటలు విన్న వాళ్లంతా చరణ్ ని పొగుడతున్నాడా? లేక యాక్టింగ్ అతని కన్నా తానే బెటర్ అని ఎన్టీఆర్ హింట్ ఇస్తున్నాడా? అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయట.
కానీ ఎన్టీఆర్ మాటల్లో మాత్రం వ్యగ్యం కనిపించలేదని, ఇద్దరి మధ్య వున్న స్వచ్ఛమైన స్నేహం కనిపించిందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి అనుబంధం వుందని, అది 'ఆర్ ఆర్ ఆర్' సమయంలో మరింత బలపడిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.